EPAPER

Rava Kesari: రవ్వ కేసరి మిక్స్‌ను ఇలా తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు

Rava Kesari: రవ్వ కేసరి మిక్స్‌ను ఇలా తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ చేసుకోవచ్చు
Rava Kesari: రవ్వ కేసరి స్వీట్ కు అభిమానులు ఎక్కువ. కానీ ఒక్కోసారి తినాలనిపించినా బద్ధకంతో చేసుకోరు. అలాంటివారు రవ్వ కేసరి ప్రీమిక్స్ ను ముందే తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు 10 నిమిషాల్లో ఈ స్వీట్ ను రెడీ చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరి ప్రీమిక్స్‌ను ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. రవ్వ కేసరి ప్రీమిక్స్ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.
రవ్వ కేసరి ప్రీమిక్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు 
ఉప్మా రవ్వ – పావు కిలో
నెయ్యి – ఒక కప్పు
మిల్క్ పౌడర్ – అరకప్పు
డ్రై ఫ్రూట్స్ – అరకప్పు
పంచదార – ఒక కప్పు
యాలకుల పొడి – ఒక స్పూను
నీళ్లు – తగినన్ని
రవ్వ కేసరి ప్రీమిక్స్ రెసిపీ 
⦿ స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి.
⦿ ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు అదే కళాయిలో కప్పు నెయ్యి వేసి రవ్వను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
⦿ ఇప్పుడు అదంతా చల్లగా అయ్యేవరకు వదిలేయాలి.
⦿ ఆ రవ్వలోనే పంచదార, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పాల పౌడర్, యాలకులపొడి వేసి బాగా కలుపుకోవాలి.
⦿ అంతే రవ్వ కేసరి ప్రీమిక్స్ రెడీ అయినట్టే.
⦿ దీన్ని ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి.
⦿ గాలి చొరబడకుండా చూసుకోవాలి.
⦿ గాలి వెళ్తే అది పాడయ్యే అవకాశం ఉంటుంది.
⦿ ఎప్పుడైతే మీరు రవ్వ కేసరి స్వీట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో నీళ్లు వేయాలి.
⦿ ఆ నీళ్లల్లో మూడు రేకులు కుంకుమపువ్వు వేసుకోవాలి.
⦿  అవి మరుగుతుండగా పక్కన మరొక బర్నర్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి.
⦿ ఆ నెయ్యిలో ప్రీమిక్స్ కొంత తీసుకొని వేసి వేయించుకోవాలి.
⦿ కుంకుమపువ్వుల నానబెట్టిన నీటిని రెడీ చేసుకోవాలి.
⦿ కళాయిలోని రవ్వలో ఈ నీటిని వేసి ఇది చిక్కగా అయ్యేవరకు, గట్టిపడే వరకు అలా కలుపుతూ ఉండాలి.
⦿  హల్వాలాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿  అంతే టేస్టీ రవ్వ కేసరి రెడీ అయినట్టే. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీంతో రవ్వ కేసరి స్వీట్ చేసుకొని తినేయవచ్చు.
ముఖ్యంగా పండగల సమయంలో, ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ రవ్వ కేసని ప్రీమిక్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ టైం కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఈ రెసిపీ సిద్ధమైపోతుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి.


Related News

Head Massage: సెలూన్‌లో తల మసాజ్ చేసుకున్నాక స్ట్రోక్ బారిన పడిన వ్యక్తి, ఇలా ఎందుకు జరుగుతుంది?

Mental Health: ఆ వ్యాధి ఉన్న వారిలో చెవిలో రకరకాల గుసగుసలు ఎందుకు వినిపిస్తాయి?

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

NTR: తారక్‌ ఒక మంచి తండ్రి కూడా.. పిల్లల పెంపకంపై ఎన్టీఆర్ చెప్పిన టిప్స్ ఇవే, అదుర్స్ అంతే!

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Cinnamon Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

×