EPAPER

Jupally: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

Jupally: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

Minister Jupally Krishna Rao Comments: సీఎం రేంవ‌త్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ‌ పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనతో ముందుకువెళ్తుతున్నట్లు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. తెలంగాణకు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించ‌డం, పర్యాటకుల, ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా తెలంగాణ‌ను ఆవిష్కరించడమే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. లాస్ ఎంజెల్స్ లోని డబుల్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రవాస భారతీయులు, విదేశీ ప్ర‌తినిధులు, ప‌ర్యాట‌కులు, అక్క‌డి అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Also Read: తెలంగాణ వైపు టీడీపీ చూపు.. ఎఫెక్ట్ ఎవరికి ? వలసలకు లీడర్స్ రెడీ అయ్యారా..

సంప్రదాయం, ఆధునికత.. ఈ రెండింటి క‌ల‌బోతనే తెలంగాణ అని ఆయన అభివ‌ర్ణించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాలు, వార‌స‌త్వ‌ సంపద, సహజమైన ప్రకృతి అందాలు, కనువిందు చేసే జలపాతాలు, న‌దులు, సెలయేర్లు, దేవాలయాలు, తెలంగాణ జాన‌ప‌ద క‌ళ‌లు, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్ప‌త‌నం, పెట్టుబడుల అవకాశాలను మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్ర ప్రజల సాంస్కృతిక జీవన విధానాలు, ఆతిథ్య సంప్రదాయాలు, ఆహార‌పు అల‌వాట్లు, పండుగలు పర్యాటకుల మనసులను దోచుకుంటాయ‌ని, కొత్త ప్రదేశాలను చుట్టేసి, కొత్త అనుభూతులు, సరికొత్త అనుభవాలు పోగేసుకోవాల‌ని అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌కు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం ప‌లికారు.


అలాగే పర్యాటకంతోపాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియాగా ప్రసిద్ధి పొందిందని, ప్రస్తుతం నగరం ప్రపంచ స్థాయి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందని జూపల్లి పేర్కొన్నారు.

Also Read: త్వరలో మంత్రివర్గ విస్తరణ.. కొండా సురేఖపై చర్యలుంటాయా? అధిష్టానం ఏం చెప్పింది?

ఫ్యూచ‌ర్ సిటీ (భవిష్యత్తు నగరం) ప్రాజెక్ట్ గురించి పరిచయం చేస్తూ, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా కాన్సుల్ జనరల్ చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related News

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

Centers: వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారా…? అయితే ఈ శుభవార్త మీ కోసమే…

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’

Jagadish Reddy: భట్టి విక్రమార్క బహిరంగ చర్చకు సిద్ధమా..? జగదీశ్ రెడ్డి సవాల్

Crop Loan War : రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ దిమ్మ తిరిగే క్లారిటీ

TDP In Telangana: తెలంగాణ వైపు టీడీపీ చూపు.. ఎఫెక్ట్ ఎవరికి ? వలసలకు లీడర్స్ రెడీ అయ్యారా..

×