EPAPER

Hair Loss: జుట్టు రాలుతోందని బాధ పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Hair Loss: జుట్టు రాలుతోందని బాధ పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Hair Loss: నేడు జుట్టు రాలడం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రస్తుతం యువత ఈ సమస్యతో పోరాడుతున్నారు. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్ తో పాటు షాంపూలను వాడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యతో ఇబ్బందిపడే వారికి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయవచ్చు.


బట్టతల సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనికి కారణం హార్మోన్లు. ఈ సమస్యకు కొన్ని నివారణలు ఉన్నాయి. వీటి సహాయంతో జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు.

కొత్తిమీరను ఉపయోగించడం:
కొత్త జుట్టు పెరగడంలో కొత్తిమీర చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పచ్చి కొత్తిమీరను గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను జుట్టు రాలిన ప్రదేశాల్లో రాయండి. క్రమం తప్ప కుండా నెలపాటు చేస్తే, కొత్త జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది.


ఉల్లిపాయ రసం :
సాధారణంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి ఉల్లిపాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కొత్త జుట్టును పెరిగేలా చేస్తుంది . ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ లాగా చేయాలి. దీనిని జుట్టు తక్కువగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. జుట్టు తక్కువగా ఉన్న ప్రాంతంలో 5 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

వేప నూనె:
వేప నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు బలంగా పెరుగుతుంది. వేప నూనె జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Also Read: ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

ఆలివ్, ఉసిరి, కొబ్బరి నూనె:
ఆలివ్, కొబ్బరి,ఉసిరి నూనెలు జుట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ నూనెలను జుట్టుకు సరిగ్గా పట్టించి, క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే జుట్టు చాలా దృఢంగా మారుతుంది.

వెల్లుల్లి:
జుట్టును బలోపేతం చేయడానికి, వెల్లుల్లి నూనె లేదా వెల్లుల్లి పేస్ట్ రాయండి. వెల్లుల్లిలో సల్ఫర్, సెలీనియం ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

NTR: తారక్‌ ఒక మంచి తండ్రి కూడా.. పిల్లల పెంపకంపై ఎన్టీఆర్ చెప్పిన టిప్స్ ఇవే, అదుర్స్ అంతే!

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Cinnamon Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

Best Face Mask: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Anti Aging Foods: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి

×