EPAPER

Punganuru Ycp Politics : పుంగనూరు వెళ్తానన్న జగన్.. ఇంతలోనే యూటర్న్!

Punganuru Ycp Politics : పుంగనూరు వెళ్తానన్న జగన్.. ఇంతలోనే యూటర్న్!

Punganuru Ycp Politics : ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. నిన్న మెున్నటి వరకూ అధికారంతో విర్రవీగిన వైసీపీ.. కూటమి గెలుపును జీర్ణించుకోలేకపోతుంది. ఏ అవకాశం దొరికినా వదలకుండా రాజకీయాల్ని రంగు మార్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో మైనర్ బాలిక హత్య ఘటనతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని వైసీపీ తెగ ప్రయత్నించింది. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగిందో కానీ వైసీపీ పాలకులు సడెన్ గా యూటర్న్ తీసుకొని రూట్ మార్చేశారు. బాధితురాలి కుటుంబాన్ని స్వయంగా పరామర్శిస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం జగన్… టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. కాగా ఈ విషయాన్ని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా ప్రకటించారు.


పుంగనూరు బాలిక హత్య కేసుతో రచ్చ సృష్టించాలని ప్రయత్నాలు చేసిన వైసీపీ వెనక్కి తగ్గింది. ఆర్థిక కారణాలతో జరిగిన ఆ చిన్నారి హత్యను… అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తూ నానా రచ్చ చేసిన వైసీపీ ప్రస్తుతం వెనక్కి తగ్గింది. కూటమి ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబుపై సైతం విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు పుంగనూరులో పర్యటిస్తామని సైతం ప్రకటించారు. మాజీ సీఎం జగన్ బాధిత కుటుంబాలతో మాట్లాడి నిజాలు నిగ్గు తేలుస్తారని ప్రచారం చేసిన నేతలు మాటలు బెడిసికొట్టాయి. ప్లాన్ మార్చేస్తూ… జగన్ పుంగనూరులో పర్యటించటంలేదంటూ మాజీ మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు.

READ ALSO : ఢిల్లీ పర్యటనలో బాబు.. కేంద్రం ప్రకటనతో షాక్.. ఇక మంచిరోజులు వచ్చినట్లే..


ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులో మైనర్ బాలిక సెప్టెంబర్ 29న అదృశ్యమయింది. 3 రోజుల పాటు 11 టీమ్స్ తో పోలీసులు, డాగ్ స్కాడ్స్ గాలింపు చర్యలు చేపట్టారు. డిఐజీతో పాటు చిత్తూరు ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి… అక్టోబర్ 2న పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పోస్టు మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరగలేదని వెల్లడైంది. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణంటూ పోలీసులు విచారణలో తెలిపారు. బాలిక తండ్రి నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారి తీసిందని చెప్పకొచ్చారు. అత్యాచారం జరగలేదని పోస్టు మార్టంలో వెల్లడైందని తెలిపారు.

ఈ ఘటనపై హోం మినిస్టర్ వంగలపూడి అనిత స్పందించారు. మంత్రులు ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి, అనిత స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం చంద్రబాబు బాధితురాలి తండ్రితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని.. ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఇంత సీరియస్ గా స్పందించే ఈ విషయంపై వైసీపీ రాజకీయాలకు సిద్ధమైంది. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. తమ అధినేత మాజీ సీఎం జగన్ వచ్చి పరామర్శిస్తారని హామీ ఇచ్చారు. మరి ఏమైందో కానీ రూట్ మార్చిన పెద్దిరెడ్డి జగన్ రావటం లేదని ప్రకటించి సైడ్ అయిపోయారు.

 

Related News

Crime News: అత్తా, కోడలి మధ్య గొడవ.. అలా కొరికేసిందేంటీ, దెబ్బకు ఊడిపడిందిగా..

Chandrababu: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

AP BJP: రాహుల్ కు స్వీట్స్ పంపిన ఏపీ బీజేపీ నేతలు.. కారణం ఇదే

Tirumala: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

Roja Comments: పవన్ కళ్యాణ్‌పై కవిత రాసిన రోజా, బుద్ధి.. జ్ఞానం ఉంటే…

×