EPAPER

70th National Film Awards : విన్నర్స్ లిస్ట్… నేషనల్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

70th National Film Awards : విన్నర్స్ లిస్ట్… నేషనల్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?

70th National Film Awards : భారతీయ చలనచిత్ర రంగం ప్రతిష్టాత్మకంగా భావించే అత్యుత్తమ 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం (70th National Film Awards) మంగళవారం, 2024 అక్టోబర్ 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతతో సహా భారతీయ సినిమా అత్యున్నత పురస్కారమైన నేషనల్ అవార్డు విజేతలను ఆగస్టు 2024లో ప్రకటించారు. మరి ఈ వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు? అనే విషయంలోకి వెళ్తే..


రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాసాహెబ్ ఫాల్కే చేసిన అపారమైన కృషిని స్మరించుకునేందుకు సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొదటిసారిగా 1969లో అందించారు. భారతీయ సినిమా వృద్ధికి, అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తుగా పలువురు సినీ ప్రముఖులను ఈ అవార్డుతో సత్కరిస్తారు. ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికైన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తితో సహా విజేతలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా సత్కరించబోవడం విశేషం.


70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ : ఆటమ్
ఉత్తమ నటుడు : రిషబ్ శెట్టి
ఉత్తమ నటి : నిత్యా మీనన్, మానసి పరేఖ్
ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా
ఉత్తమ సహాయ నటుడు: పవన్ మల్హోత్రా
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఉత్తమ చిత్రం: కాంతారావు
ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ 2
ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1
ఉత్తమ కన్నడ చిత్రం : KGF-చాప్టర్ 2
ఉత్తమ హిందీ చిత్రం : గుల్‌మోహర్

జానీ మాస్టర్ కు అవార్డు క్యాన్సిల్  

జానీ మాస్టర్‌కు మొదట మంజూరు చేసిన బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు పెండింగ్ రేప్ ఆరోపణల కారణంగా క్యాన్సిల్ అయ్యింది. అయితే ఆయనతో పాటు విన్నర్ గా నిలిచిన సతీష్ కృష్ణన్ మాత్రం అవార్డును అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

జాతీయ అవార్డుల్లో రికార్డులు బద్దలు కొట్టిన సినిమా
జాతీయ అవార్డులను ఎక్కువసార్లు అందుకుని రికార్డును క్రియేట్ చేసిన సినిమాల విషయానికి వస్తే.. ముందుగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘లగాన్’ (2002) గురించి చెప్పుకోవాలి. ఈ ఒక్క సినిమా ఏకంగా ఎనిమిది నేషనల్ అవార్డులను అందుకుని అత్యధిక జాతీయ అవార్డులను గెలుచుకున్న రికార్డును క్రియేట్ చేసింది.

అత్యధిక నేషనల్ అవార్డులు పొందిన సినిమాల లిస్ట్ 
లగాన్ (2001): 8
బాజీరావ్ మస్తానీ (2015): 7
గాడ్ మదర్ (1998): 6
కన్నతిల్ ముత్తమిట్టల్ (2002): 6
ఆడుకలం (2010): 6
ఆర్ఆర్ఆర్ (2022): 6
సూరరై పొట్రు (2020): 5
గంగూబాయి కతియావాడి (2022): 5
పొన్నియిన్ సెల్వన్: I (2022): 4

నేషనల్ అవార్డుల వేడుకను ఎక్కడ చూడాలి?
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం యూట్యూబ్‌లో DD న్యూస్ ఛానెల్ ద్వారా ప్రసారం కానుంది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ లైవ్ అక్టోబర్ 8న మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఫ్రీగానే షోను చూడవచ్చు.

Related News

Trivikram: సమంత కోసం అందరం ఏదో ఒకటి చేయాలి.. ఆమె ఒక శక్తి.. త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు

Poonam Kaur: త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. నిర్మాతపై మండిపడ్డ పూనమ్

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine : లిప్ కిస్ తో టెంప్ట్ అయిన హీరోయిన్.. అవ్వా.. అక్కడే పని కానిచ్చేసిందిగా..

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Pushpa 2: నీయవ్వ.. తగ్గేదేలే.. చెప్పిన డేట్ కు రావడం పక్కా..

×