EPAPER

Prasanth Neel With Ntr: ప్రీక్వెల్ లేదు సీక్వెల్ లేదు కంప్లీట్ సింగిల్ సినిమా

Prasanth Neel With Ntr: ప్రీక్వెల్ లేదు సీక్వెల్ లేదు కంప్లీట్ సింగిల్ సినిమా

Prasanth Neel With Ntr: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచం మొత్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూసా రేంజ్ కి వచ్చాం. ఈ రీసెంట్ గా చాలా పెద్ద సినిమాలు షూటింగ్ ప్రాసెస్ లోనే పార్టు అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా పార్టీ అనౌన్స్ చేయడం వల్ల ఉన్న ఫస్ట్ పార్ట్ లోని కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా తీయడం కూడా మొదలుపెట్టారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో ఈ ట్రెండ్ మొదలైంది. బాహుబలి సినిమాను రెండు పార్ట్స్ లో చూపించడంలో రాజమౌళి 100% సక్సెస్ అయ్యారు. ఇక చాలా సినిమాలు రిలీజ్ అవ్వక ముందే పార్ట్ 2 ను అనౌన్స్ చేశాయి. కొన్ని సినిమాలు పార్ట్ వన్ ఫెయిల్ అవ్వడంతో పార్ట్ 2 ని అలానే వదిలేశారు.


సౌత్ సినిమా ఇండస్ట్రీలో కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రశాంత్ నీల్. మామూలుగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అలానే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా వచ్చిన కే జి ఎఫ్ 2 కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇక అప్పటినుంచి ప్రశాంత్ నీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. అక్కడితో ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను చేశాడు ప్రశాంత్. ప్రభాస్ కెరియర్ కి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కం బ్యాక్ అయింది. సినిమా ఫస్ట్ షో పడగానే పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ఎప్పుడో అనౌన్స్ చేశారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు తెలిసిన విషయమే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఫ్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ లేదు అని తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా సాగిపోయే సింగిల్ సినిమా అని సమాచారం వినిపిస్తుంది. త్వరలో కూడా దీని గురించి అధికార ప్రకటన రానుంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కూడా తర్వాత పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ వసూలు చేపడుతుంది.


కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా మొదట ఒక పార్ట్ లోని ఫినిష్ అయిపోతుంది అనుకున్న తరుణంలో కొంత మేరకు షూటింగ్ జరిగిన తర్వాత. ఈ సినిమా కూడా 2 పార్ట్స్ లో రాబోతుంది అని అనౌన్స్ చేశారు ఇక ఈ సీక్వెల్ కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా దేవర సినిమాలో క్రియేట్ చేశారు. అవి అంత ఆసక్తికరంగా లేకపోయినా కూడా సెకండ్ పార్ట్ పైన అంచనాలు పెంచడానికి పలు ఇంటర్వ్యూస్ లో రకరకాల మ్యాటర్స్ రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియాలి అంటే ఇంకొన్ని ఏళ్ళు వేచి చూడక తప్పదు.

Related News

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine : లిప్ కిస్ తో టెంప్ట్ అయిన హీరోయిన్.. అవ్వా.. అక్కడే పని కానిచ్చేసిందిగా..

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Pushpa 2: నీయవ్వ.. తగ్గేదేలే.. చెప్పిన డేట్ కు రావడం పక్కా..

Regina Cassandra : రెజినా వెనుక ఇంత కుట్ర జరిగిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

RajaSaab: మారుతి బర్త్ డే స్పెషల్ వీడియో.. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు

×