EPAPER

Anirudh : ఎంత రిలేటివ్ అయిన అంత స్వార్ధం ఉండకూడదు

Anirudh : ఎంత రిలేటివ్ అయిన అంత స్వార్ధం ఉండకూడదు

Anirudh : ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో ఆ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లడానికి, ఆ సినిమా మీద ఒక మంచి ఫీల్ క్రియేట్ చేయడానికి సంగీతం కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాల్లో పాటలు కూడా ఉండకపోవచ్చు. కానీ కొన్ని సన్నివేశాలని హైలెట్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ అని చాలా వచ్చేసాయి గానీ ఒకప్పుడు సినిమా మీద బజ్ క్రియేట్ చేయాలి అంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ కంటే ముందు చాలా క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చేసేవి. ఆ తర్వాత కాలంలో డివిడి లు వచ్చాయి. ప్రతి సినిమాకి సంబంధించి ఆడియో ఫంక్షన్స్ జరిగేవి. ఇప్పుడు మాత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు అన్ని పాటలను ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేసేవాళ్ళు. ఆ పాటలే సినిమా మీద ఆసక్తిని పెంచేవి. సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చేవి. కొన్నిసార్లు పాటలు హిట్ అయినా కూడా సినిమా డిజాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ కి కొన్ని నెలల ముందు ఫస్ట్ సింగిల్ అంటూ సెకండ్ సింగిల్ అంటూ పాటలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజుల ముందు టీజర్, రిలీజ్ కు దగ్గరలో ట్రైలర్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ టైమ్స్ లో సినిమా ఫస్ట్ సింగిలే సినిమా మీద మంచి అంచనాలను పెంచుతుంది. చాలా పెద్ద సినిమాలు ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం చాలామంది ఆడియన్స్ ఇప్పుడు ఎదురు చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుత కాలంలో కేవలం తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియా ఇండస్ట్రీలోని అనిరుద్ కి మంచి క్రేజ్ ఉంది. అనిరుద్ నుంచి ఒక సాంగ్ వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోస్ కు అనిరుద్ సంగీతం అందించాడు. అయితే అనిరుద్ అందరిని మించి రజనీకాంత్ కి అద్భుతమైన సంగీతం అందించాడు చెప్పాలి.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పెట్ట సినిమాతో మొదటిసారి రజనీకాంత్ కోసం పనిచేశాడు. ఆ సినిమాలోని ప్రతి పాట అద్భుతమైన హిట్ అయింది. రజనీకాంత్ ను అద్భుతంగా చూపించి అద్భుతమైన హిట్ అందుకున్నాడు ఆ సినిమాతో కార్తీక్. ఆ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం మెయిన్ హైలెట్. ఇప్పటికీ కూడా ఆ సాంగ్స్ విన్న ప్రతిసారి మంచి ఊపు వస్తుంది. ఇక నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో హుకుం సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రజనీకాంత్ కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చిన సాంగ్ అది. థియేటర్లో కూడా ఆ సాంగ్ అదే రేంజ్ లో పేలింది. ఇక ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వెట్టయన్ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించాడు.


ఈ సినిమాకి సంబంధించిన అన్ని పాటలు కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి. ఇక రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన హంటర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత రిలేటివ్ అయినా కూడా రజినీకాంత్ సినిమాకు మాత్రమే డ్యూటీ చేయడం కరెక్ట్ కాదు. అందరు హీరోలకి అదే రేంజ్ లో ఇవ్వచ్చు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ కి అనిరుద్ కి బంధుత్వం ఉన్న విషయం చాలా మందికి తెలిసిందే. అందువలనే రజినీకాంత్ సినిమా అంటే అనిరుద్ కొంతమేరకు తన స్వార్థం చూపించి మంచి మ్యూజిక్ ఇస్తాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Poonam Kaur: త్రివిక్రమ్ ను ప్రశ్నించే దమ్ముందా.. నిర్మాతపై మండిపడ్డ పూనమ్

Heroine Laya: శివాజీ తో కలిసి లయ కొత్త ప్రయాణం.. ఇక్కడైనా సక్సెస్ అవుతుందా..?

Heroine : లిప్ కిస్ తో టెంప్ట్ అయిన హీరోయిన్.. అవ్వా.. అక్కడే పని కానిచ్చేసిందిగా..

Vijay: శివకార్తికేయన్‌కు విజయ్ కాస్ట్‌లీ గిఫ్ట్.. చేసిన సాయం మర్చిపోలేదు

Spirit: ప్రభాస్ తో మెగాస్టార్.. హైప్ తో చచ్చిపోతే.. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ.. ?

Pushpa 2: నీయవ్వ.. తగ్గేదేలే.. చెప్పిన డేట్ కు రావడం పక్కా..

Regina Cassandra : రెజినా వెనుక ఇంత కుట్ర జరిగిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

×