EPAPER

Tips For Skin Glow: చర్మం మిలమిలా మెరిసిపోవాలా ? అయితే వీటిని వాడండి

Tips For Skin Glow: చర్మం మిలమిలా మెరిసిపోవాలా ? అయితే వీటిని వాడండి

Tips For Skin Glow: ముఖం అందంగా ఉంటేనే మనం ఆకర్షణీయంగా కనిపిస్తాము. అలాంటి ముఖ చర్మం మృదువుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి స్క్రబ్బింగ్ అవసరం. అదే విధంగా శరీరం మృదువుగా ఉండాలంటే కూడా స్క్రబ్బింగ్ చేయాలి. మిల్లెట్ బాడీ స్క్రబ్‌ను ఇందుకు చాలా ఉపయోగపడుతుంది.


శరీర చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం చర్మం అందంగా ఉండాలని చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవాలని ప్రతి రోజు సబ్బు, బాడీ వాష్‌లను ఉపయోగిస్తాము. చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండటానికి బాడీ లోషన్‌ను కూడా ఉపయోగిస్తాము. కానీ వీటిని రసాయనాలతో తయారు చేస్తారు. రసాయనాలతో తయారు చేసిన బాడీ లోషన్ లను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి.

అయితే, కొన్నిసార్లు మన చర్మం తాజాగా ఉండటానికి బాడీ లోషన్ లను వాడినా కూడా ఫలితం ఉండదు. ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి మంచి స్క్రబ్బింగ్ చాలా అవసరం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. మిల్లెట్స్ స్క్రబ్‌ను ఇందుకు ఎంతగాపో ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మిల్లెట్ బాడీ స్క్రబ్ కోసం కావలసినవి:

మిల్లెట్ – 1 పెద్ద కప్పు ( ఏదైనా ఒక రకం)
మీగడ – 2 టేబుల్ స్పూన్లు
పచ్చి పాలు – 1 కప్పు
పసుపు – 1 టేబుల్ స్పూన్
కాఫీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్

మిల్లెట్ బాడీ స్క్రబ్‌ని ఇలా తయారు చేయండి :

ఒక గిన్నె తీసుకుని పచ్చి పాలు, మిల్లెట్స్ వేసి నానబెట్టండి. మిల్లెట్‌ను పచ్చి పాలలో సుమారు 1 గంట నానబెట్టాలి. మిల్లెట్ పూర్తిగా నానిన తర్వాత మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మిల్లెట్‌లో మీగడ, కాఫీ పౌడర్. పసుపు వేసి బాగా కలపాలి. మీరు పేస్ట్ మందంగా ఉంటే అందులోనే 1 టేబుల్ స్పూన్ పాలు కలపండి. ఇలా తయారు చేసిన మిల్లెట్ బాడీ స్క్రబ్ శరీరంపై ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. స్నానం చేసే ముందు మీ మొత్తం శరీరంపై దీనిని స్క్రబ్‌ లాగా ఉపయోగించవచ్చు. ఈ స్క్రబ్‌ని అప్లై చేసిన తర్వాత, సుమారు 1 నుండి 2 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.

Also Read: శనగపిండి, పెరుగుతో.. కొరియన్ స్కిన్ మీ సొంతం

ప్రయోజనాలు: 

మిల్లెట్ బాడీ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మంలోని బ్లాక్‌హెడ్స్, మచ్చలు తొలగిపోతాయి.
ఈ బాడీ స్క్రబ్ సూర్యుని హానికరమైన కిరణాల వల్ల కలిగే టాన్‌ను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.

రంధ్రాలలో పేరుకుపోయిన మురికి దీని వల్ల క్లియర్ అవుతుంది. దీని కారణంగా మీ శరీరం యొక్క చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.
మిల్లెట్స్ లో విటమిన్ సి ఉంటుంది. ఈ స్క్రబ్‌ను శరీరంపై అప్లై చేయడం వల్ల రంధ్రాలలో పేరుకుపోయిన మురికి శుభ్రపడుతుంది. దీని వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Papaya Face Pack: మీరు తెల్లగా మెరిసిపోవాలా ? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Cinnamon Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌‌తో ముఖంపై మొటిమలు మాయం

Hair Loss: జుట్టు రాలుతోందని బాధ పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Best Face Mask: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Anti Aging Foods: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి

Sunflower Seeds: పొద్దు తిరుగుడు విత్తనాలను గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

×