EPAPER

Pawan Kalyan: న్యాయం వైపు నిలబడాలి అని నాగార్జున వైపు మాట్లాడటం లేదా.?

Pawan Kalyan: న్యాయం వైపు నిలబడాలి అని నాగార్జున వైపు మాట్లాడటం లేదా.?

Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా అలుపెరగకుండా శ్రమించి నేడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పదేళ్లపాటు ఎన్నో సమస్యలపై స్పందించారు. అధికార పార్టీని ఎన్నోసార్లు ప్రశ్నించారు. వాస్తవానికి ఈ పదేళ్లు జనసేన పార్టీ ప్రజల్లో చాలా యాక్టివ్ గా పనిచేసింది. ఇక ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలు పైన స్పందించడం పూర్తిగా మానేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో జరిగే ప్రతి సమస్య పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసేవాళ్ళు. సినిమా టికెట్ రేట్స్ విషయంలో కూడా ముందుగా స్పందించింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత నాని,రామ్ వంటి హీరోలు స్పందించారు.


ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సమస్య తర్వాత మరో సమస్య పుట్టుకొస్తూనే ఉంటుంది. అలానే చాలామంది ఇండస్ట్రీ పైన విమర్శలు చేస్తున్న విషయం కూడా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కొండ సురేఖ అక్కినేని కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపాయి. హైడ్రాలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎన్ కన్వెన్షన్ను కూల్చకుండా ఉండటానికి సమంతను తన వద్దకు పంపమని నాగార్జునను కేటీఆర్ కోరినట్లు, దానికి సమంత ఒప్పుకోకపోవడం వల్లనే నాగచైతన్యతో విడాకులు అయినట్లు ఓపెన్ గా కామెంట్ చేశారు కొండ సురేఖ. ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అలానే సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఇండస్ట్రీలో మునిపెన్నడు రియాక్ట్ అవ్వనంత రేంజ్ లో ఈ ఇష్యూ పై మాట్లాడారు చాలామంది తెలుగు పరిశ్రమ సెలబ్రిటీలు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి నటులతో పాటు నాని వంటి నటులు కూడా ఈ ఇష్యూపై స్పందించారు.

ఇండస్ట్రీపై ఇటువంటి తప్పుడు వార్తలు, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఇంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంపై కూడా స్పందించలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండడం వలన కావచ్చు తిరుపతి లడ్డు వ్యవహారం, అలానే సనాతన ధర్మం అనే అంశాల పైన తీవ్రంగా దృష్టిపెట్టారు. సభలు పెట్టి కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ అడిగినా కూడా ఏకంగా ఫ్యాన్స్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయం, అలానే నాగర్జున ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాటల్ని కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై చాలామందికి కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.


కొండా సురేఖ కామెంట్స్ పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు కాబట్టి చెరువులను ఆక్రమించి బిల్డింగ్ కట్టడాలని పవన్ కళ్యాణ్ సమర్ధించరు. అందుకని కనీసం ఒక మాట కూడా ఆ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక కొండ సురేఖ చేసిన కామెంట్స్ విషయానికి వస్తే వాస్తవానికి అటు సినీ పరిశ్రమతోను ఇటు రాజకీయ రంగంలోనూ పవన్ కళ్యాణ్ కి మంచి అవగాహన ఉంది ఇలాంటి విషయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలామందికి తెలిసి వస్తుంది. అయినా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Related News

RajaSaab: మారుతి బర్త్ డే స్పెషల్ వీడియో.. వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఏమున్నాడ్రా బాబు

Nagarjuna: కొండా సురేఖను జైల్లో పెట్టండి.. కోర్టు ముందు నాగ్ ఆవేదన..!

Hina Khan: స్టార్ నటి కుమార్తెకు క్షమాపణలు చెప్పిన హీరోయిన్..

Raja Saab Movie : రాజా సాబ్ మరో రికార్డు… నైజాం రాజు ఎప్పటికైనా ప్రభాసే…

Star Heroine: జూన్లో నిశ్చితార్థం.. కట్ చేస్తే ఇంకొకరితో పెళ్లి..!!

Thaman : దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కష్టమే… చెర్రీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన తమన్

Tollywood: పేరుకే టాప్ సెలబ్రిటీస్.. తెర వెనుకంతా రోతే..!

×