EPAPER

IPS Sunilkumar: ఏపీలో మరో ఐపీఎస్‌కు కష్టాలు, సునీల్ కుమార్‌కు కేవలం 15 రోజులే మాత్రమే..

IPS Sunilkumar: ఏపీలో మరో ఐపీఎస్‌కు కష్టాలు, సునీల్ కుమార్‌కు కేవలం 15 రోజులే మాత్రమే..

IPS Sunilkumar: వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులకు టెన్షన్ మొదలైందా? చంద్రబాబు సర్కార్ ఎందుకు ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చింది? కోరి కష్టాలు తెచ్చుకుంటు న్నారాయనా? 15 రోజుల్లో ఆయన క్లారిఫికేషన్ ఇవ్వకుంటే ఏం జరుగుతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా జోరుగా సాగుతోంది.


ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు.. రాజకీయ అండదండలు ఉన్నాయని రెచ్చిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడిప్పుడే ఏపీలోని కొంతమంది అధికారులకు తత్వం బోధపడుతోంది. వైసీపీ అండ చూసుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన ఐపీఎస్ సునీల్‌కుమార్‌కు చంద్రబాబు సర్కార్ తొలి హెచ్చరిక జారీ చేసింది.

మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఫిర్యాదు మేరకు సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. దీనిపై ఈ ఐపీఎస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ పోస్టు వచ్చింది. సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి తిరస్కరించిన కేసులో కొత్త ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీకే విదిలేస్తున్నానని రాసుకొచ్చారు.


సునీల్ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసుల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్నట్టు భావించింది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలో ఆయనకు అధికారులు ఛార్జి మెమో జారీ చేశారు. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: పెళ్లంటూ ప్రకటించిన కొద్ది క్షణాలకే.. మరో వివాదంలో దివ్వెల మాధురీ.. అదే నిజమైతే..!

ఇంతకీ ఆ ఐపీఎస్ అధికారి రిప్లై ఇస్తారా? లేక తన నిజాయితీ శంకిస్తున్నారని దూరంగా ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై సునీల్‌కుమార్ (IPS Sunilkumar) పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇప్పుటికే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనకు మెమో ఇవ్వడంతో వైసీపీ అధికారులు షాకయ్యారు. సచివాలయం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరి అధికారుల మాట.

Related News

Nagendrababu Rajyasabha : ఫైనల్ డెసిషన్ కు వచ్చేసిన డిప్యూటీ సీఎం.. రాజ్య సభకు మెగా బ్రదర్?

Crime News: అప్పు ఇచ్చాడు.. ఏకంగా భార్యను పంపమన్నాడు.. కట్ చేస్తే..?

Punganuru Ycp Politics : పుంగనూరు వెళ్తానన్న జగన్.. ఇంతలోనే యూటర్న్!

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో బాబు.. కేంద్రం ప్రకటనతో షాక్.. ఇక మంచిరోజులు వచ్చినట్లే..

YSRCP-Congress: కాంగ్రెస్‌కు జంప్ అయిపోదామా.. వైసీపీలో లుకలుకలు, షర్మిలాతో సంప్రదింపులు?

Divvala Madhuri: మేము ఆ తప్పు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దువ్వాడ, దివ్వెల మాధురి

CM Chandrababu meet PM Modi: ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు గంటపాటు భేటీ, చివరలో లడ్డూ వ్యవహారం కూడా?

×