EPAPER

TGSRTC: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

TGSRTC: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

TGSRTC Special Buses For Dussehra Festival: దసరా, బతుకమ్మ పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారికి టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా క్షేమంగా తమ సొంత గమ్యాలకు చేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తాజాగా, రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరో అదనపు బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.


గతేడాది కంటే ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ పెరగడంతో అదనంగా 600 స్పెషల్ సర్వీసులను నడిపేందుకు నిర్ణయించుకున్నట్లు సజ్జనార్ తెలిపరు. ఈ సర్వీసులు ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గత ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడవద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం ద‌సరా ఆప‌రేష‌న్స్‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ప్రయాణికులను తమ సొంత గ్రామాలకు సురక్షితంగా చేరుకునేలా పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారని గుర్తు చేశారు.


Also Read: ఆ విషయంలో తెలంగాణ భేష్ : అమిత్ షా

ఆర్టీసీ డ్రైవర్లు అనుభవంతో బస్సులు నడుపుతారని, కావున ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని చెప్పారు. అనవసరంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడకూడదని ప్రయాణికులకు తెలియజేయాలని పోలీసులు, అధికారులకు సూచించారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో పోలీసులతోపాటు రవాణాశాఖ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.

Related News

Minister Tummala: గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల ముఖాముఖీ

Amit Shah: ఆ విషయంలో తెలంగాణ భేష్ : అమిత్ షా

Guidelines: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Hyderabad MP: సచివాలయాన్ని కూడా కూల్చేస్తారా…?

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

Pawan Kalyan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..?

×