EPAPER

Guidelines: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Guidelines: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Guidelines for the implementation of financial Assistance: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న సీఎం రేవంత్ సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ ను తాజాగా విడుదల చేసింది. గల్ఫ్ కి వెళ్లి మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.


Also Read: సచివాలయాన్ని కూడా కూల్చేస్తారా…?

ఇందుకోసం అర్హులను ఎంపిక చేసేందుకు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సదరు గల్ఫ్ బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుడి మృతిచెందిన ఆరు నెలల్లోపు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది సర్కారు. కువైట్, ఇరాన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇది వర్తించనున్నది.


Also Read: అత్యుత్సాహం చూపిస్తున్న ఆ నేతలు.. తల పట్టుకుంటున్న పార్టీ పెద్దలు?

Related News

Minister Tummala: గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల ముఖాముఖీ

TGSRTC: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

Amit Shah: ఆ విషయంలో తెలంగాణ భేష్ : అమిత్ షా

Hyderabad MP: సచివాలయాన్ని కూడా కూల్చేస్తారా…?

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

Pawan Kalyan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..?

×