EPAPER

Divvala Madhuri: పెళ్లంటూ ప్రకటించిన కొద్ది క్షణాలకే.. మరో వివాదంలో దివ్వెల మాధురీ.. అదే నిజమైతే..!

Divvala Madhuri: పెళ్లంటూ ప్రకటించిన కొద్ది క్షణాలకే.. మరో వివాదంలో దివ్వెల మాధురీ.. అదే నిజమైతే..!

Duvvada Srinivas – Divvala Madhuri: ప్రస్తుతం సోషల్ మీడియా కపుల్స్ అంటే టక్కున ఎవరి పేరు చెప్తారు మీరు.. ఇంకెందుకు ఆలస్యం చెప్పేసేయండి.. దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి అని మొహమాటం వద్దులే.. అంటున్నారు నేటి యూత్. ఈ జంటకు యూత్ క్రేజ్ అంతా ఇంతా కాదు. జస్ట్ ఒక్క వీడియో కానీ, ఫోటో కానీ దివ్వెల మాధురి పోస్ట్ చేస్తే చాలు.. వ్యూస్ మిలియన్స్ రావాల్సిందే. అటువంటి ఈ కపుల్స్ కాని కపుల్స్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతటితో ఆగక శ్రీవారి పుష్కరిణి దగ్గర ఫోటో షూట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంతకు ఈ ఫోటో షూట్ ఎందుకో తెలుసా.. ఇక ఆగండి.. మీరు ఊహించింది నిజమే.


శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు పొలిటికల్ గా కంటే ఇటీవల ఫాలోయింగ్ ఎక్కువైందని చెప్పవచ్చు. దీనికి కారణం ఆయన సతీమణి వాణికి ఆయనకు మధ్య వివాదం రేగడం ఒక కారణం కాగా.. మరొకరు దివ్వెల మాధురి. తమకు అన్యాయం జరిగిందంటూ వాణి ఆరోపిస్తూ.. మీడియాను ఆశ్రయించారు. అలాగే శ్రీనివాస్ ఇంటి ముందు 20 రోజులకు పైగా దీక్ష చేశారు. అప్పుడే దివ్వెల మాధురి విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని ఏకంగా శ్రీనివాస్ కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు.

ఇక రంగంలోకి దిగిన దివ్వెల మాధురి.. ఔను మేము స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఉంటున్నాము అయితే తప్పేంటి అంటూ ఏకంగా ప్రెస్ మీట్ లో చెప్పేశారు. తాను దువ్వాడకు అండాదండా అంటూ.. చెప్పడమే కాక, దువ్వాడకు పప్పు ఇష్టం.. సాంబార్ ఇష్టం అంటూ శ్రీనివాస్ అభిరుచులు కూడా ఓపెన్ గా చెప్పేశారు. ఈ వివాదం సమయంలో మాధురి కారుకు యాక్సిడెంట్ కూడా జరగడం విశేషం. యాక్సిడెంట్ కి కారణం కూడా తానేనని, తానే ఢీ కొట్టినట్లు మాధురి పెను సంచలనం సృష్టించారు.


అయితే దివ్వెల మాధురి స్వయంగా నాట్య శిక్షకురాలు. తన సోషల్ మీడియా పేజీల ద్వారా.. వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేవారు. ఈ వివాదం సమయంలో ఆమె డ్యాన్స్ వీడియోలు వైరల్ కాగా.. ఇప్పుడు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మొత్తం మీద దువ్వాడకు కుటుంబ పరమైన వివాదం కొంత సద్దుమణిగిన వాతావరణం కనిపిస్తుండగా.. ఇక వీరి చెట్టాపట్టాలకు ఎదురు లేకుండా పోయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం ఇటీవల సోషల్ మీడియా వేదికగా.. మాధురి వంట చేస్తూ.. శ్రీనివాస్ గారికి ఈ వంట ఇష్టం.. నేనెప్పుడూ ఇదే ఆయనకు వడ్డిస్తానంటూ వీడియో పోస్ట్ చేశారు. సరే ఆ వీడియో వైరల్ గా మారింది అనుకొనే లోపే.. ఈసారి ఒకే బైక్ పై దువ్వాడ, దివ్వెల వ్యాపార ప్రకటన కూడా చేశారు. ఈ వీడియోలో దువ్వాడ బైక్ నడుపుతుండగా.. వెనుక మాధురి కూర్చొని ఉన్నారు. ఇలా ఈ వీడియో కూడా వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడేమి అంటారా.. తాము కోర్టు కేసులు పరిష్కారమయ్యాక.. పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ మాధురి చెప్పకనే చెప్పేశారు. అది కూడా తిరుమలలో. తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీనివాస్, మాధురి తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నేటి యూత్ ఆసక్తికి తగినట్లుగా.. వీరు కూడా పెళ్లికి ముందు శ్రీవారి పుష్కరిణి వద్ద ఫోటో షూట్ జరుపుకున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్‌కు కొత్త శత్రువులు.. కేసుల మీద కేసులు పెడుతోన్న జనసైనికులు, ఇక వారికి చుక్కలే!

ఇక వీరి ఫోటో ఘాట్ చిత్రీకరణకే అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ అధిక సంఖ్యలో కనిపించింది. కొందరు మాధురితో సెల్ఫీలు కూడా తీసుకున్నారంటే క్రేజ్ అటువంటిది మరి. ఇక తిరుమలలో ఫోటో షూట్ జరుపుకున్న ఈ కపుల్ కానీ కపుల్.. మేము కపుల్స్ అవుతున్నామంటూ ప్రకటించేశారు. అలాగే శ్రీనివాస్ కూడా తాము రెండేళ్లుగా కలిసి ఉంటున్నామని, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. అలాగే మాధురికి తన వల్ల అన్యాయం జరిగింది కాబట్టి.. ఆమెకు అండగా ఉంటానన్నారు. అదన్నమాట.. ఇక మా పెళ్లికి త్వరలోనే ఆహ్వానాలు అందుతాయని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ జంట.

అయితే వీరు శ్రీవారి ఆలయం పరిసరాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా రీల్స్ చేయడం నిబంధనలకు విరుద్దమని, వీరిపై చర్యలు తీసుకోవాలని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏమేరకు వాస్తవం ఉందో.. లేదో కానీ.. ఈ విషయం కూడా మాధురి వీడియోల మాదిరిగానే వైరల్ అవుతోంది.

Related News

Pawan Kalyan: పవన్‌కు కొత్త శత్రువులు.. కేసుల మీద కేసులు పెడుతోన్న జనసైనికులు, ఇక వారికి చుక్కలే!

Dussehra Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? 800 స్పెషల్ ట్రైన్స్ సిద్ధం, వెంటనే టికెట్ బుక్ చేసుకోండి

Vijayawada: పేకాట ఆడిన ఖాకీ బాస్ లు.. వీడియో వైరల్.. తెగ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

AP Govt: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక ఆ సాయం రెట్టింపు..

Prakash Raj on Pawan Kalyan: ‘అర్థమైంది రాజా’.. పవన్‌పై అందుకేనా సెటైర్లు.. #JustAsking

Punganur Minor Girl Incident: పుంగనూరు చిన్నారి ఘటన.. బాబు Vs జగన్

×