EPAPER

Alleti Maheshwar Reddy: ‘మహా’ ఎన్నికల్లోనూ మోసం చేద్దామనా?

Alleti Maheshwar Reddy: ‘మహా’ ఎన్నికల్లోనూ మోసం చేద్దామనా?

– రుణమాఫీపై చర్చకు రెడీయా?
– ప్రధాని మాటల్లో అబద్ధమేముంది?
– అసత్యాలు చెబుతూ ఆయనకే లేఖా?
– ‘మహా’ ఎన్నికల్లోనూ మోసం చేద్దామనా?
– రుణమాఫీ జరగలేదనేది అవాస్తవమా?
– బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం.. మరి మీరు?
– రుణమాఫీపై సీఎంకు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ


హైదరాబాద్, స్వేచ్ఛ: రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడాన్ని తెలంగాణ శాసనసభ బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. సీఎం లేఖ వాస్తవాలకు దూరంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే ప్రధానికి అబద్ధాలతో కూడిన లేఖ రాశారంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని, వేదిక ఖరారు చేయాలంటూ సీఎంకు సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు.

Also Read: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..


ఇదీ నేపథ్యం..
తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటూ గత అసెంబ్లీ ఎన్నికల వేళ హామీలిచ్చిందని, కానీ వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందంటూ అక్టోబరు 5న మహారాష్ట్రలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇంకా రుణమాఫీ కాలేదంటూ వేలాది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారంటూ మాట్లాడారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, అసలు గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. తప్పుడు సమాచారంతోనే మీరు ఆ వ్యా్ఖ్యలు చేసి ఉండొచ్చని సీఎం అందులో ప్రస్తావించారు.

రాజకీయ లబ్దికేనా?
ప్రధాని వ్యాఖ్యలు మహారాష్ట్ర ఓటర్లను ప్రభావితం చేస్తాయనే భయంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకే సీఎం లేఖ రాశారంటూ ఏలేటి ఆరోపించారు. ఆరు నెలలైనా ఇంకా రుణమాఫీ సంపూర్ణం కాలేదని, దీనిపై ప్రజల్లో ఆగ్రహాన్ని గ్రహించే గత లోక్‌సభ ఎన్నికలలో ముఖ్యమంత్రి కనిపించిన దేవుళ్లందరి మీదా ఒట్టేసి, ఓట్లేయించుకున్నాడని విమర్శించారు. రుణమాఫీ కాలేదని మంత్రులే చెబతున్నారని, ఈ అంశంపై ప్రభుత్వానికే ఒక క్లారిటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రాసిన లేఖ మహారాష్ట్ర ప్రజలనే గాక దేశాన్నీ తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.

Also Read: 2014 నుంచి చెరువులను ఇలా కబ్జా చేశారు.. కళ్లకు కట్టినట్లు చూపించిన భట్టి, ఇవిగో ఆధారాలు!

లేఖలో ప్రశ్నలివే..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రూ.2లక్షలలోపు పంట రుణాలు ఒకే ద‌ఫాలో మాఫీ చేస్తామ‌ని టీపీసీసీ చీఫ్‌గా మీరు చెప్పలేదా? పదినెలలైనా, నేటికీ సగం మందికీ రుణమాఫీ కాలేదన్నది వాస్తవం కాదా? రూ.2లక్షల లోపు పంట రుణాల మాఫీకి, రూ.49,500కోట్లు కావాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పిన మాట నిజం కాదా? తర్వాత రూ. 40 వేల కోట్లు కావాలని 2024 మే 1న గాంధీ భవన్‌లో మీరు మాట్లాడలేదా? తర్వాతి క్యాబినెట్ సమావేశంలో రుణ‌మాఫీకి రూ.31వేల కోట్లు అవ‌స‌ర‌మ‌ని నిర్ణయించింది నిజం కాదా? తీరా.. మీరు కేటాయించింది బడ్జెట్లో కేవలం రూ.26వేల కోట్లన్నది వాస్తవమా కాదా? అని నిలదీశారు. ఈ అంశంపై తాము ప్రభుత్వంతో బహిరంగ చర్చకు సిద్ధమని, వేదిక, సమయం ముఖ్యమంత్రే నిర్ణయించుకోవాచ్చని సవాలు విసిరారు.

Related News

TGSRTC: గుడ్ న్యూస్.. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రత్యేక బస్సులు

Amit Shah: ఆ విషయంలో తెలంగాణ భేష్ : అమిత్ షా

Guidelines: ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. అప్లై చేసుకున్నారా?

Hyderabad MP: సచివాలయాన్ని కూడా కూల్చేస్తారా…?

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

Pawan Kalyan: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..?

×