EPAPER

Elon Musk: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

Elon Musk: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

Elon Musk Petition: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతుగా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి విజయం సాధిస్తే వాక్ స్వాతంత్ర్యంతో పాటు ప్రాణాలను కాపాడుకునే అవకాశం లేకుండా పొతుందన్నారు. కమలా హారిస్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ..  ట్రంప్ గెలుపునకు కృషి చేస్తున్నారు.


వాక్ స్వాతంత్ర్యం, ఆయుధాలు ధరించే హక్కు కోసం సంతకాల సేకరణ

అమెరికా అధ్యక్ష ఎన్నిలక ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఎలన్ మస్క్, ప్రస్తుత బైడెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ(PAC) ప్రారంభించిన రెండు పిటీషన్లకు మద్దతు పలికారు. వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడటంతో పాటు ఆయుధాలు ధరించే హక్కు కోసం సంతకాల సేకరణను మొదలు పెట్టారు. ఆయన స్వయంగా ఈ రెండు పిటీషన్లకు మద్దతుగా సంతకాలు చేశారు. దేశ ప్రజలంతా ఈ పిటీషన్ పై సంతకాలు చేయాలని రిక్వెస్ట్ చేశారు.


పిటీషన్ పై సంతకాలు చేసే వారికి బంఫర్ ఆఫర్

అటు ఈ పిటీషన్లపై సంతకాలు చేసే ఓటర్లకు మస్క్ మామ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. ఈ రెండు సవరణలకు మద్దతుగా సంతకం చేసిన ప్రతి ఓటర్ కు 47 డాలర్లు, భారత కరెన్సీలో సుమారు రూ. 4 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. “ఈ పిటీషన్ లో సంతకం చేయడం ద్వారా రెండు సవరణలకు నేను మద్దతు పలుకుతున్నాను. ఈ పిటీషన్ పై సంతకాలు చేసే ప్రతి ఓటరుకు 47 డాలర్లు అందిస్తాం” అని మస్క్ ప్రకటించారు.

ఈ పిటీషన్ పై సుమారు మిలియన్ సంతకాలు సేకరించాలని మస్క్ టీమ్ టార్గెట్ పెట్టుకుంది. అమెరికాలోని కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నెవాడా, అరిజోనా, మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాలో పెద్ద మొత్తంలో సంతకాలను సేకరించాలని భావిస్తోంది. అక్టోబర్ 21 వరకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగనుంది.

ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ట్రంప్ ను గెలిపించాలి

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నకు మద్దతుగా ఆయన ప్రచారం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికాలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ట్రంప్ ను గెలిపించాలని ఓటర్లకు రిక్వెస్ట్ చేశారు. లేదంటే అమెరికాలో ఒకే ఒక్క పార్టీ మిగిలే అవకాశం ఉందన్నారు. ఇకపై ఎన్నికలు అనే మాట కూడా వినిపించకపోవచ్చని హెచ్చరించారు.

“మీకు తెలిసిన వాళ్లందరినీ ఓటు వేసేలా ప్రోత్సహించండి. ఇప్పుడు ఓటు వేయకపోతే, ఇకపై ఓటు వేసే అవకాశం ఉండకపోవచ్చు. ఈసారి ట్రంప్ గెలవకపోతే, అమెరికాలో ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఈ ఎన్నికలు అమెరికా ప్రజల జీవితాలకు సంబంధించినవి” అని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు.

“మనకు ప్రస్తుతం ఓ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన కనీసం విమానం మెట్లు కూడా ఎక్కలేరు. ట్రంప్.. బుల్లెట్ దూసుకొస్తున్నా ఏమాత్రం బెదరడు. ఆయన ధైర్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?” అంటూ ట్రంప్ ను ప్రశంసల్లో ముంచెత్తారు.  మస్క్ రంగంలోకి దిగడంతో కమలా హ్యారిస్ వర్గానికి భయం పుట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, అందరికీ ఆయుధాలు అందితే ఆత్మరక్షణ మాట దేవుడెరుగు.. అది ఉగ్రవాదులు, ఉన్మాదులకు అవకాశంగా మారదు కదా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అమెరికాలో గన్ కల్చర్ గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఉంటే.. మిస్ యూజ్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువే. మరి జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Read Also:ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Related News

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

Viral News: 51 ఏళ్ల టీచరమ్మ ‘కామ’ పాఠాలు, బాలుడితో అలా చేస్తూ.. మరెక్కడా చోటు దొరకలేదా?

Chinese killed: పాకిస్థాన్‌లో చైనీయులపై ఉగ్రదాడి.. చైనావాసులనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?

Nobel Prize 2024: ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్, ఇంతకీ ఎవరు వారు? ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలిస్తే షాకవుతారు

Israel Hamas War: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

Israel-Iran War: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు.. 24 మంది మృతి.. విమానాలు రద్దు చేసిన ఇరాన్

×