EPAPER

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

IIFA awards 2024.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది ఆడియన్స్ ను సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే పాన్ ఇండియా హీరో గా పేరు సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరోకి.. తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. ఈ విషయం తెలిసి స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఐఫా 2024 లో ఉత్తమ నటుడిగా అవార్డు..

ఆయన ఎవరో కాదు ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జా (Teja sajja)తాజాగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ హీరో తేజ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హనుమాన్ సినిమాలో తేజ అద్భుతమైన నటన కనబరిచిన విషయం తెలిసిందే. తన నటనతో విమర్శకులను కూడా మెప్పించాడు. ఈ క్రమంలోనే తేజాకు 2024 ఐఫా అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు లభించబోతోంది.


హనుమాన్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు..

ఇకపోతే బాల నటుడి గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన మొదటి సినిమాతోనే ఏకంగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే హనుమాన్ లో తేజ చేసిన క్యారెక్టర్ ఆయన కెరీర్ నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. హనుమాన్ చిత్రంలో సూపర్ హీరోగా తేజ అందరిని కట్టిపడేశారు. అంతే కాదు హనుమాన్ సినిమా ద్వారా తేజ రెండవసారి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్నారు. ఇకపోతే చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన ఈ హనుమాన్ చిత్రం మరిన్ని అవార్డులు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్..

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.330 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, ఇటు ఓటీటీ లోకి వచ్చింది. ఇక్కడ కూడా భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో తేజ సజ్జ భాగం కావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానంటూ తేజా సజ్జ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

తేజ సజ్జ కెరియర్..

ఇక తేజ సజ్జ విషయానికి వస్తే.. 1998లో చూడాలని ఉంది అనే చిత్రం ద్వారా బాల నటుడి గా ఇండస్ట్రీకి పరిచయమైన తేజ 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. 2021లో వచ్చిన జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మరి.. గతేడాది హనుమాన్ చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మొత్తానికైతే తేజ భారీ సక్సెస్ తో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మరో ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Related News

Emraan Hashmi: బ్రేకింగ్.. షూటింగ్ లో గాయాల పాలైన ఓజీ విలన్

Ka Mass Jathara: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ

Natty Kumar: పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖండించలేదే.. నట్టి కుమార్ వ్యాఖ్యలు

Rashmika Mandanna: రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఇంతవరకు చూడని సరికొత్త లుక్!

NTR: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ?

Akkineni Nagarjuna: దానికి పవనే అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్ చాలు

×