EPAPER

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

 Google Theft Protection : ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌… త్వరలోనే కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ ను ఎవరైనా దొంగిలించినా.. అందులోని డేటా దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది.


గూగుల్‌ అత్యాధునిక Theft Protection ఫీచర్ ను ఆండ్రాయిడ్‌ వాడే యూజర్ల కోసం తీసుకురానుంది. అయితే ఈ సరి కొత్త ఫీచర్ ఏ పరికరాలకు మద్దతు ఇస్తుంది… ఎలా పనిచేస్తుందనే పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

గూగుల్‌ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ – ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌ 10 కంటే అప్‌డేట్‌ వెర్షన్‌ కలిగిన స్మార్ట్ పరికరాలను సపోర్టు చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ వాడే వినియోగదారుల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పొగొట్టుకున్నా,  ఎవరైనా దొంగిలించినా హ్యాండ్‌ సెట్‌లోని డేటాను భద్రంగా కాపాడుతుంది.


ఇక గూగుల్ తీసుుకురాబోయే ఈ Theft Protection లో 3 ఫీచర్స్ ప్రధానంగా ఉన్నాయి. ఇందులో థెఫ్ట్‌ డిటెక్షన్ లాక్‌, ఆఫ్‌లైన్‌ డివైస్ లాక్‌, రిమోట్‌ లాక్‌ లను ఉన్నాయి.  ఆండ్రాయిడ్‌ సెట్టింగ్స్‌ యాప్‌లో Theft Protecion పేరుతో సెర్చ్‌ చేసి వీటీ వినియోగాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో గూగుల్‌ సర్వీస్ > ఆల్‌ సర్వీస్‌ > పర్సనల్‌ డివైస్‌ సేఫ్టీలపైన క్లిక్ చేస్తే ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

ALSO READ : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Theft Detection Lock- థెఫ్ట్‌ డిటెక్షన్‌ లాక్‌ : స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఎవరైనా దొంగిలిస్తే.. సెన్సార్‌, వైఫై, ఇతర స్మార్ట్‌ డివైస్‌ కనెక్షన్‌ల ద్వారా గుర్తించి… వెంటనే ఫోన్‌ను లాక్‌ చేస్తుంది. దీంతో ఫోన్ లో సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది.

Offline Device Lock – ఆఫ్‌ లైన్‌ డివైస్‌ లాక్ : ఫోన్‌ను దొంగిలించిన వారెవరైనా వెంటనే లోకేషన్‌ ట్రాక్‌ చేసే అవకాశం లేకుండా ఫోన్‌ వైఫై లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను ఆపేసిన సమయంలో ఫోన్ ను రక్షిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఫోన్ వెంటనే లాక్ అవుతుంది. ఆఫ్‌లైన్‌ మోడ్‌లో స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పుడు సైతం వ్యక్తిగత డేటా ను ఈ ఫీచర్ రక్షిస్తుంది.

Remote Lock – రిమోట్‌ లాక్‌ : స్మార్ట్‌ ఫోన్‌ ను ఎవరైనా దొంగలించిన సమయంలో రిమోట్‌ లాక్‌ ఫీచర్‌ ను ఉపయోగించి ఎక్కడి నుంచైనా హ్యాండ్‌సెట్‌ను లాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం android.com/lock వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. ఫోన్ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయ్యి స్మార్ట్‌ఫోన్‌ను లాక్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ఏడాది జూన్‌ లోనే గూగుల్‌ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను బ్రెజిల్‌లో పరీక్షించారు. ఇప్పటికే పిక్సల్, శాంసంగ్‌ సహా పలు కంపెనీ ఎలక్ట్రానిక్స్ వాడే యూజర్స్ కు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

అయితే ఇప్పటికే గూగూల్ తమ కస్టమర్ల సౌకర్యర్ధం పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. త్వరలోనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లపై సైతం కీలక ప్రకటనలు చేయనుంది. గూగుల్‌ లైవ్‌ను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో… త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ వంటి ప్రాంతీయ భాషల్లోకి తీసుకురానుంది. ఇక గూగుల్ మ్యాప్స్‌లో సైతం పలు అప్డేట్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Related News

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

×