EPAPER

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Vivo X200 Pro Mini : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Vivo తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో మెుబైల్స్ ను లాంఛ్ చేస్తుంది. తాజాగా Vivo X200 Pro మినీ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ ముందుగా  చైనాలో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో  Vivo X200 Pro మినీ ఫోన్‌కు సంబంధించిన కొన్ని లైవ్ ఫోటోలు, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి స్మార్ట్ ఫోన్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.


 ఇందులో స్మార్ట్ ఫీచర్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన డిజైన్‌ను సైతం కలిగి ఉండనుంది. లేటెస్ట్ అప్డేడేటెడ్ వెర్షన్ లో ఈ ఫోన్ కస్టమర్స్ కు అందుబాటులోకి రానుంది.

స్పెసిఫికేషన్స్ – Vivo X200 Pro మినీ… ఫోన్ 6.3 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 1440 x 3200 పిక్సెల్‌ల డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, హై ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్ తో లాంచ్ చేయబడుతుంది.  గేమింగ్ యాప్స్, వీడియో ఎడిటింగ్ యాప్స్ తో పాటు పలు లేటెస్ట్ యాప్స్ ను ఎంతో చక్కగా సపోర్ట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది.


కెమెరా – Vivo X200 Pro మినీ స్మార్ట్‌ఫోన్… 50MP సోనీ LYT 818 మెయిన్ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, 200MP తో టెలీ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రాబోతుంది. హై క్వాలిటీ పిక్చర్స్, వీడియోలను సపోర్ట్ చేస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP కెమెరా ఉంది. ఇక LED ఫ్లాష్ తో పాటు అధునాతన ఫీచర్స్ ను సైతం ఈ ఫోన్ లో జోడించారు.

ALSO READ : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

స్టోరేజీ – ఈ స్మార్ట్ ఫోన్  16GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో లాంచ్ అవుతుంది.

ఆడియో – వివో ఈ ఫోన్ ఆడియో క్వాలిటీని మరింత మెురుగ్గా తీసుకువచ్చింది.

బ్యాటరీ – 5500mAh బ్యాటరీతో  Vivo X200 Pro Mini  స్మార్ట్ ఫోన్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ సదుపాయం ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్,  30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

OriginOS 5 ఆధారంగా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో  Vivo X200 Pro Mini స్మార్ట్‌ఫోన్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ అప్డేట్, హై సెక్యూరిటీని అందిస్తుంది. ఇందులో GPS, 5G, Wi-Fi, USB టైప్-సి పోర్ట్‌తో సహా డిఫరెంట్ కనెక్టివిటీలకు సపోర్ట్ చేసే ఫీచర్లు ఉన్నాయి.

ధర – Vivo X200 Pro Mini ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫీచర్లు హై రేంజ్ లో ఉండటంతో ధర సైతం అదే స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. ఇక వివో మాత్రం ఈ ఫోన్ ధరను ప్రకటించలేదు.

Related News

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

×