EPAPER

Thangalaan OTT: ‘తంగలాన్’కు భారీ షాక్.. ఈ సినిమా ఓటీటీలో చూడడం కష్టమే!

Thangalaan OTT: ‘తంగలాన్’కు భారీ షాక్.. ఈ సినిమా ఓటీటీలో చూడడం కష్టమే!

Thangalaan OTT: భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు, భారీ అంచనాల మధ్య విడుదలయిన సినిమాలు.. ఒక్కొక్కసారి డిశాస్టర్‌గా నిలుస్తాయి. అలా కోలీవుడ్‌లో నుండి వచ్చిన ఒక భారీ బడ్జెట్ చిత్రం ‘తంగలాన్’. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంత కష్టపడ్డాడని ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడే ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఆ ఫస్ట్ లుక్‌తోనే వారిలో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కానీ మూవీ విడుదలయిన మొదటి రోజు నుండే నెగిటివ్ టాక్ అందుకుంది. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూడాలకునే ప్రేక్షకులకు భారీ షాక్ తగలనుంది. ‘తంగలాన్’ ఓటీటీ రిలీజ్ చుట్టూ పలు రూమర్స్ తిరుగుతున్నాయి.


ప్రేక్షకుల్లో నిరాశ

ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. వాటికి పోటీగా ‘తంగలాన్’కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం మూవీ టీమ్ అంతా భారీగా ప్రమోషన్స్ చేశారు. కేవలం తమిళంలోనే కాకుండా ఈ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలయ్యింది. దీంతో ప్రతీ భాషలో ‘తంగలాన్’ను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం మూవీ టీమ్ కష్టపడింది. ఈ మూవీలో పల్లెటూరి మనుషుల్లాగా కనిపించడం కోసం విక్రమ్‌తో పాటు మాళవికా మోహనన్, పార్వతి ఎంత కష్టపడ్డారో పలు సందర్భాల్లో బయటపెట్టారు. దీంతో ప్రేక్షకుల్లో కూడా అసలు ఈ సినిమాలో ఏముందో చూడాలనే ఆసక్తి మొదలయ్యింది. కానీ ఎంతో ఆసక్తితో ‘తంగలాన్’ చూడడానికి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు.. నిరాశతో బయటికొచ్చారు.


Also Read: మూవీ బజ్ లేదు.. మళ్లీ జైలర్ మ్యాజిక్ జరిగేనా..?

డీల్ క్యాన్సెల్

‘తంగలాన్’కు ఫస్ట్ డే నుండే నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది ప్రేక్షకులు.. ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చులే అని పక్కన పెట్టేశారు. ఈ సినిమా విడుదల అవ్వకముందే నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ డీల్ పూర్తయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే నెలలోపే ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుందని ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికీ ‘తంగలాన్’ థియేటర్లలో విడుదలయ్యి దాదాపు రెండు నెలలో అవుతోంది. అయినా ఇంకా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో నెట్‌ఫ్లిక్స్.. ఈ ఓటీటీ డీల్‌ను క్యాన్సెల్ చేయాలనే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి.

బడ్జెట్‌లో సగం

అసలైతే ‘తంగలాన్’ మూవీ గత నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కావాల్సింది. కానీ అలా జరగకపోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘తంగలాన్’ డిశాస్టర్ అవ్వడంతో దీని ఓటీటీ రైట్స్‌ డీల్‌ను క్యాన్సెల్ చేయాలనే ఆలోచనలో ఉందట నెట్‌ఫ్లిక్స్. ఈ మూవీ విడుదల అవ్వకముందు రూ.35 కోట్లతో ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిందట. కానీ ఇప్పుడు ఈ డిశాస్టర్ మూవీని స్ట్రీమ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. రూ.135 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘తంగలాన్’.. ప్రపంచవ్యాప్తంగా రూ 71.45 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ ఉంటుందా లేదా అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related News

Akkineni Nagarjuna: దానికి పవనే అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్ చాలు

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

Sudheer Babu: అప్పుడు మంచు మనోజ్, ఇప్పుడు వరుణ్ తేజ్.. యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు

Rajendra Prasad : మా అమ్మ మళ్లీ చనిపోయింది, పంపించేసి వస్తా.. రమాప్రభతో రాజేంద్ర ప్రసాద్ – కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Rajinikanth: రజినీకాంత్ జోక్యం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Singham Again Trailer: పోలీస్ రామాయణం.. రావణుడు మాత్రం హైలైట్ అంతే..

×