EPAPER

Women’s T20 World Cup: పాక్‌పై విక్టరీ.. టీమిండియా సెమీస్ చేరడం ఎలా..?

Women’s T20 World Cup: పాక్‌పై విక్టరీ.. టీమిండియా సెమీస్ చేరడం ఎలా..?

 Team India Won By 6 Wickets Against Pakistan in Women’s T20 World Cup 2024 Match: ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా.. రెండవ మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టి.. ఈ టోర్నమెంటులో.. బోని కొట్టగలిగింది. అయితే పాకిస్తాన్ జట్టు పైన టీమిండియా విజయం సాధించినప్పటికీ… టి20 ప్రపంచ కప్ లో సెమిస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే.. టీమిండియా మరింత కష్టపడాల్సి ఉంది.


Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

ప్రస్తుతం టీమిండియా రన్‌ రేట్‌ చాలా తక్కువగా ఉంది. పాకిస్తాన్ జట్టు పైన భారీ రన్ రేట్ తో గెలిస్తే ఈ టెన్షన్ ఉండేది కాదు. కానీ చాలా స్లోగా పాకిస్తాన్ పైన ఆడిన టీం ఇండియా విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ నెగిటివ్ లోనే ఉంది. టీమిండియా ప్రస్తుత రన్ రేట్ – 1.217. అటు మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమిండియా పై విజయం సాధించి 2.9 రన్ రేట్ తో స్టాప్ పొజిషన్లో ఉంది. అలాగే గ్రూప్ ఏ లో ఉన్న ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ పైన గెలిచిన టీమిండియా ఇంకా నాలుగో స్థానంలోనే ఉంది. ఐదో స్థానంలో శ్రీలంక ఉంది.


Also Read: IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

దానికి కారణం పాకిస్తాన్ రన్ రేట్ ఎక్కువగా ఉండటమే. ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లలో రెండు సెమి ఫైనల్ కు వెళ్తాయి. కాబట్టి టీమిండియా సెమిస్ బరిలో దిగాలంటే మరో రెండు మ్యాచ్లు కచ్చితంగా గెలవాలి. అలాగే న్యూజిలాండ్ ఒక మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంటుంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్.. శ్రీలంక అలాగే ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ రెండు జట్లపై భారీ విజయాలను సాధిస్తే సెమీ ఫైనల్ కు వెళుతుంది. మరి మనవాళ్లు తర్వాతి మ్యాచ్‌ లు ఎలా ఆడతారో చూడాలి.

Related News

IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

IND vs BAN: విడాకుల తర్వాత పాండ్యా విధ్వంసం.. బంగ్లాపై భారత్ ఘన విజయం!

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

×