EPAPER

TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

TG Politics: బాబును కలిసిన తీగల, మల్లారెడ్డి.. టీడీపీలోకి అంటూ పొలిటికల్ బాంబ్.. కానీ..

Ex Minister Mallareddy: తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటే అదొక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈయన మైక్ పట్టుకొని ప్రసంగిస్తే చాలు.. సభికుల నోట చిరునవ్వు రావాల్సిందే. తాను అనుకున్న మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో మల్లారెడ్డి తరువాతే ఎవరైనా. ఈయన స్టెప్ వేస్తే.. సోషల్ మీడియాలో హల్ చల్ చేయాల్సిందే.


గతంలో తన క్రేజ్ పై మల్లారెడ్డి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి కంటే తనకు ఎక్కువ క్రేజ్ ఉందని, తాను యూత్ అంటూ ఛలోక్తులు విసిరారు. ఇలా నిరంతరం ఏదో ఒక రూపేణా వార్తల్లో నిలిచే పొలిటికల్ యంగర్ గా మల్లారెడ్డిని చెప్పవచ్చు.

అయితే తెలంగాణలో ఎన్నికలు రాగానే అధికారం కాంగ్రెస్ వశమైంది. కానీ బీఆర్ఎస్ తరపున మేడ్చల్ నుండి పోటీ చేసిన మల్లారెడ్డి మాత్రం విజయాన్ని అందుకున్నారు. కొంత జోష్ తగ్గిందని అనుకున్నా.. తన మాట.. పాట.. ఆటలో ఏ మాత్రం మార్పు లేదంటూ పలుసార్లు మల్లారెడ్డి నిరూపించుకున్నారు.


తాజాగా మహిళలతో కలిసి మల్లారెడ్డి బతుకమ్మ ఆడిన వీడియో సైతం వైరల్ గా మారింది. గతంలో మల్లారెడ్డి టీడీపీలోకి వెళుతున్నారని, టీటీడీపీ పగ్గాలు ఆయనకేనంటూ ప్రచారం సైతం సాగింది. అలాగే కాంగ్రెస్ లోకి కూడా వెళ్తారని ప్రచారం సాగినా.. మల్లారెడ్డి స్తబ్దతగా ఉండిపోయారు.

ఈ దశలో ఇటీవల ప్రతి పార్టీ నేతను మల్లారెడ్డి కలుస్తున్నారు. అదేదో పార్టీలలో చేరేందుకు మాత్రం కాదు కానీ.. తన మనవరాలు శ్రేయారెడ్డి వివాహానికి రావాలని వివాహ ఆహ్వాన పత్రికను మల్లారెడ్డి అందజేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలు వివాహానికి ఆహ్వానించేందుకు తాను కలిసినట్లు మల్లారెడ్డి తెలిపారు. కానీ ఇక్కడే ఒక రాజకీయ మెలిక ఉందని భావించవచ్చు.

చంద్రబాబును కలవడంపై తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవానికి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ఆ ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. అలాగే హైదరాబాద్ అభివృద్దికి బాబు ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. తాను టీడీపీలోకి వెళుతున్నట్లు తీగల ప్రకటించగా.. అదే సమయంలో మల్లారెడ్డి సైతం ప్రక్కనే ఉన్నారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు మల్లారెడ్డి నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలోకి చేరితే.. టీటీడీపీ బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Also Read: Konda vs Akkineni: పరువు నష్టం కేసు విచారణ.. రేపు కోర్టు మెట్లు ఎక్కనున్న నాగార్జున?

కాగా మల్లారెడ్డి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నా.. తీగలను తనతో పాటు తీసుకెళ్ళి బాబును కలవడం.. అనంతరం టీడీపీలోకి వెళుతున్నట్లు తీగల తెలపడం వెనుక వీరిద్దరి రాజకీయ వ్యూహం ఉందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ వెళుతున్నట్లు.. తర్వాత అన్నీ మాట్లాడుకుందామని బాబు చెప్పినట్లు చివరగా తీగల చెప్పారు. ఇక తీగల టీటీడీపీలోకి చేరితే.. బీఆర్ఎస్ నుండి తొలి వికెట్ పడినట్లే.

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

×