EPAPER

Amla Oil For Hair: ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Amla Oil For Hair: ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Amla Oil For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాలే జుట్టును చూస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. మారిన జీవనశైలితో పాటు.. అనారోగ్య సమస్యలు, కాలుష్యం కూడా జుట్టు రాలడానికి కారణం అని చెప్పవచ్చు. మరి జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు బయట మార్కెట్లో దొరికే రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ వాడకుండా ఇంట్లోనే ఉసిరి కాయలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఉసిరికాయ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంతే కాదు దీనితో నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరి నూనె జుట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఉసిరి నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును బలంగా, మందంగా, నల్లగా చేయడానికి సహాయపడుతుంది. చాలా మంది ఉసిరి నూనెను జుట్టుకు ఉపయోగించడానికి ఇదే ప్రధాన కారణం.

కల్తీ ఉసిరి నూనె మార్కెట్‌లో దొరుకుతుంది. కానీ దీనిని ఉపయోగించడం వల్ల హాని జరుగుతుంది. అందకే ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది తయారు చేయడం సులభం అంతే కాకుండా ఖర్చు కూడా తక్కువ. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆమ్లా ఆయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉసిరి నూనె ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
తాజా ఉసిరికాయలు – 10-12
కొబ్బరి నూనె – 250 గ్రాములు
కలబంద ముక్కలు – 1 చిన్న కప్పు ( ఇష్టమైతే )

ఉసిరి నూనెను తయారుచేసే విధానం:
ఉసిరి నూనెను తయారు చేయడానికి, ముందుగా ఉసిరికాయను శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తరువాత ఉసిరికాయలను కట్ చేసి, గింజలను వేరు చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను గ్యాస్ పై పెట్టి చిన్నగా ముక్కలు చేసుకున్న ఉసిరి ముక్కలను గిన్నెలో వేసుకోవాలి. చిన్న మంటపై కొద్దిగా వేయించాలి. ఉసిరికాయ కాస్త వేగిన తర్వాత అందులో కొబ్బరినూనె వేసి ఉడికించాలి.

ఇష్టమైతే ఇందులోనే కలబంద ముక్కలను కూడా వేసుకోండి. నూనెలో వాటి రంగు మారే వరకు ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై ఉడికించాలి.

ఈ ఆయిల్ బాగా ఉడికిన తర్వాత గ్యాస్‌ను ఆఫ్ చేసి, ఆయిల్‌న చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన నూనెను గాజు సీసాలో నింపి నిల్వ చేయండి. ఇలా చేస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన ఉసిరి నూనె సిద్ధం అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్‌ను హెయిర్ కు అప్లై చేయండి.

Also Read: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

నూనె వాడకం:
మీరు ఈ నూనెను జుట్టుకు వారానికి 2-3 సార్లు రాసుకోవచ్చు. జుట్టు మూలాలకు నూనెను బాగా మసాజ్ చేసి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఉసిరి నూనె జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టును బలంగా చేస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టును నల్లగా మెరిసేలా చేస్తుంది. ఉసిరి నూనె చుండ్రును తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Jeera Water: జీలకర్ర వాటర్‌తో ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Tips For Skin: శనగపిండి, పెరుగుతో.. కొరియన్ స్కిన్ మీ సొంతం

Coconut Milk For Skin: కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్.. మీ అందం రెట్టింపు

Tips For Skin: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Big Stories

×