EPAPER

Swag Weekend Collections : ఫస్ట్ వీకెండ్ దారుణంగా కలెక్షన్స్… ఇలాగైతే ‘శ్వాగ్’ స్వాహా

Swag Weekend Collections : ఫస్ట్ వీకెండ్ దారుణంగా కలెక్షన్స్… ఇలాగైతే ‘శ్వాగ్’ స్వాహా

Swag Weekend Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘శ్వాగ్’ మూవీ కలెక్షన్లు రోజురోజుకూ తగ్గుతున్నాయి. ఇక ఈ వీకెండ్ అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టిన కలెక్షన్స్ దారుణం అనిపిస్తున్నాయి. ఇలాగైతే ఈ మూవీ కలెక్షన్ పరంగా స్వాహా అవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఫస్ట్ వీకెండ్ ‘శ్వాగ్’ మూవీ రాబట్టిన కలెక్షన్స్ ఎంతో చూసేద్దాం పదండి.


‘శ్వాగ్’ మూవీ త్రీ డేస్ కలెక్షన్స్…

శ్రీ విష్ణు హీరోగా, హసిత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్వాగ్’. ‘రాజరాజ చోర’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ‘శ్వాగ్’ మూవీతో మరోసారి రిపీట్ అయింది. ఈ సినిమాలో రీతు వర్మ, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా  కనిపించగా, మీరాజాస్మిన్ గెస్ట్ రోల్ పోషించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ పెంచిన ‘శ్వాగ్’ మూవీ మిక్స్డ్ టాక్ తో సాగుతోంది. ఈ మూవీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. పైగా ఈ మూడు రోజుల్లో రోజురోజుకూ కలెక్షన్స్ తగ్గుతుండడం గమనార్హం. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.35 కోట్లు, రెండవ రోజు 1.8 ఎనిమిది కోట్లు రాబట్టింది. ఇక మూడవ రోజు అంటే ఆదివారం నాడు వీకెండ్ అయినప్పటికీ ‘శ్వాగ్’ మూవీకి వచ్చిన కలెక్షన్స్ నిర్మాతలను టెన్షన్ పెట్టే విధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా 2.56 కోట్ల షేర్ ను, 6.41 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ కలెక్షన్ల విషయంలో ఇంత నెమ్మదిగా ఉంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే.


‘శ్వాగ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘శ్వాగ్’ మూవీకి 5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 6 కోట్ల షేర్ ను రాబటాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న టాక్, బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే మరో రెండు రోజులు మాత్రమే టైమ్ ఉంది. అక్టోబర్ 10 నుంచి పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి అంతలోపు ‘శ్వాగ్’ మూవీ ఎన్ని కోట్లు రాబడుతుంది? నిర్మాతలు సేఫ్ జోన్ లో పడతారా? అన్నది తెలియాలంటే వెయిట్ అండ్ సి.

‘శ్వాగ్’ కలెక్షన్స్ తగ్గడానికి కారణం ఇదేనా? 

‘శ్వాగ్’ మూవీకి ఆశించిన రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ చిత్రబృందమే. మూవీ ప్రమోషన్స్ కు పెద్దగా టైమ్ కేటాయించలేదు. అంతేకాకుండా ప్రస్తుతం థియేటర్లలో ‘దేవర’ ఫీవర్ నడుస్తోంది. ఇది చాలదన్నట్టు ‘సత్యం సుందరం’ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది, దీంతో ‘శ్వాగ్’ మూవీపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అన్పించట్లేదు. ఇక ‘శ్వాగ్’ కలెక్షన్స్ విషయంలో ఈ స్పీడ్ లో వెళ్తే స్వాహా అవ్వాల్సిందే.

Related News

Kiran Abbavaram: కుర్ర హీరో ఏడాది గ్యాప్.. ఆ తప్పును సరిదిద్దికోవడానికే.. ?

Thangalaan OTT: ‘తంగలాన్’కు భారీ షాక్.. ఈ సినిమా ఓటీటీలో చూడడం కష్టమే!

Parasuram : క్రేజీ హీరోతో పరుశురాం కొత్త మూవీ.. థియేటర్లలో డీజే మోగాల్సిందే..

Tollywood : దసరా సినిమాల జాతర… ఈ వారం థియేటర్లలో, ఓటిటిల్లో రాబోతున్న మూవీస్ ఇవే

Chiranjeevi : ఊటీలో మెగా ప్రాపర్టీని కొన్న చిరు… ధర ఎంతో తెలుసా?

Shruti Marathe: ఈమె ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య.. డోలు పట్టిందంటే పూనకాలే, శృతి మరాఠే గురించి ఈ విషయాలు తెలుసా?

Vettaiyan: మూవీ బజ్ లేదు.. మళ్లీ జైలర్ మ్యాజిక్ జరిగేనా..?

Big Stories

×