EPAPER

Pub Culture in Hyderabad: అమ్మాయి అందంతో ఎర.. పబ్‌లో గలీజ్ పనులు

Pub Culture in Hyderabad: అమ్మాయి అందంతో ఎర.. పబ్‌లో గలీజ్ పనులు

Increasing Pub Culture in Hyderabad: హైదరాబాద్ అంటేనే అన్నిమతాలకు, సంస్కృతులకు మారు పేరు. అలాంటి మహా నగరాన్ని గత కొంత కాలంగా మత్తు అనే పాశ్చాత్య విష సంస్కృతి కలుషితం చేస్తుంది. ఒకప్పుడు.. ముంబై, ఢిల్లీ ఇతర ప్రదేశాలలో మత్తు వినియోగం, పబ్ కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్‌లో పబ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్ వచ్చిందంచే చాలు యువత పబ్బుల్లో మద్యం సేవించి, ఊగిసలాడుతూ.. అర్ధ నగ్న డాన్సులకు ఎగబడుతున్నారు.


ఇక ఇదే ఛాన్స్ అంటూ పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మంది అమ్మాయిలను పెట్టి వారితో డాన్సులు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది యువతను పబ్‌లకు వచ్చేలా చేస్తున్నారు. టూరిస్ట్, వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్ రిసార్ట్స్‌లో వారి చేత అర్ధ నగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఇక అక్కడికి వచ్చిన వారిని.. అమ్మాయిలతో వల వేయించి ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

దీనిపై హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని రైడ్స్ చేసినా.. ఎన్ని శిక్షలు విధించిన .. పబ్బు గబ్బు మితిమీరిపోతూనే ఉంది. ఇక హైదరాబాద్ లోని పలు నగరాల్లో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ముంబై తరహాలో డాన్సులు, అమ్మాయిలతో కస్టమర్లకు వల వేయడం ఆగడం లేదు. KBR పార్క్ దగ్గర టాట్ పబ్ నిర్వాకం మరువక ముందే.. JNTU మంజీర మెజిస్టిక్ మాల్‌లో కింగ్స్ అండ్ క్వీన్స్ రెస్ట్రో బార్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


Also Read:  యూఎస్‌లో IMEX … పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి జూప‌ల్లి

అమ్మాయిలతో కస్టమర్లకు వల వేయడమే కాకుండా.. ఎక్కువ బిల్లుల వసూళ్లకు ప్లాన్ చేస్తోంది పబ్ యాజమాన్యం. అంతే కాదు పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిల్ని సప్లై చేస్తున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా పబ్ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక పోలీసులు కూడా కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై తూతూ మంత్రంగా రైడ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సిటీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి ఘటనలపై పోలీసులు సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగేదిలేదు.. మూసీ బాధితుల‌కు రేవంత్ మ‌రో భ‌రోసా

Jupalli: యూఎస్‌లో IMEX … పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి జూప‌ల్లి

Sharannavaratri: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?

Bathukamma: అమెరికాలోనూ బతుకమ్మకు అరుదైన గుర్తింపు… అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు

Harishrao: హరీశ్‌రావు నయా యాక్షన్ ప్లాన్.. దసరా రోజు వారికి ఇబ్బందులు తప్పవా?

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

×