EPAPER

Sharannavaratri: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?

Sharannavaratri: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?

– తెలంగాణకు దసరా శోభ
– రోజుకో రూపంలో అమ్మ దర్శనం
– కిటకిటలాడుతున్న ప్రధాన ఆలయాలు
– పల్లెల్లోనూ సందడిగా దసరా వేడుకలు


హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పండుగ సెలవులు రావటంతో పట్టణ, నగర వాసులంతా తమ తమ ప్రాంతాలకు చేరకుని, సమీపంలోని ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు.. ఊరూరా ఏర్పాటుచేసిన మండపాల్లో నవరాత్రి ఉత్సవాలను యువత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

Also Read: హరీశ్‌రావు నయా యాక్షన్ ప్లాన్.. దసరా రోజు వారికి ఇబ్బందులు తప్పవా?


ప్రధాన ఆలయాల్లో వేడుకలు..

దసరా శరన్నవరాత్రి వేడుకలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అటు ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అటు.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రెండో బాసరగా ప్రసిద్ధి పొందిన సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యా సరస్వతి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ పార్వతి, మహా సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇటు రాజధానిలోని బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

Related News

Jupalli: యూఎస్‌లో IMEX … పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి జూప‌ల్లి

Bathukamma: అమెరికాలోనూ బతుకమ్మకు అరుదైన గుర్తింపు… అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు

Harishrao: హరీశ్‌రావు నయా యాక్షన్ ప్లాన్.. దసరా రోజు వారికి ఇబ్బందులు తప్పవా?

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ

Appointments: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

×