EPAPER

Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

Home Minister Vangalapudi Anitha: అత్యాచారం కాదు.. హత్య చేశారు.. ఎందుకు మైనర్ బాలికను రాజకీయాల్లోకి లాగుతారు.. దయచేసి రాజకీయం చేయవద్దు.. ఇకనైనా మారండి.. అంటూ వైసీపీ నేతలకు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత క్లాస్ పీకారు. ఇంతకు అసలేం జరిగిందంటే ?


చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని హోం మినిస్టర్ వంగలపూడి అనిత పరామర్శించారు. మైనర్ బాలిక మృతి పట్ల వైసీపీ నాయకులు సైతం స్పందించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చిన్నారిని కాపాడడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని, చిన్నారి జాడను కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ విమర్శలపై హోం మంత్రి.. వైసీపీని క్లాస్ తీసుకునే రేంజ్ లో రిప్లై ఇచ్చారు.

మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి మాట్లాడుతూ.. గత నెల 29వ తేదీన రాత్రి 7:30 గంటలకు బాలిక అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. ఆ క్షణం నుండి జిల్లా ఎస్పీ, డీఎస్పీలు, సీఐ స్థాయి అధికారులు 12 బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. ఈ గాలింపు చర్యలకు ముస్లిం మైనారిటీ సభ్యులు కూడా సహకరించినట్లు, అయితే దురదృష్టవశాత్తు ఈనెల రెండవ తేదీన పుంగనూరులోని స్టోరేజ్ ట్యాంకులో బాలిక శవమై తేలిందన్నారు.


ఈ ఘటనకు బాధ్యులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారని, అనంతరం వారిని అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసును ఛేధించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు చేశారని.. తక్కువ కాలవ్యవధిలో నిందితులను అరెస్టు చేయడంపై హోం మంత్రి, జిల్లా పోలీసులను అభినందించారు.

Also Read: AP Govt: రేపే వారి ఖాతాల్లో నగదు జమ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. చెక్ చేసుకోండి..

అలాగే మంత్రి మాట్లాడుతూ.. ఒక మైనర్ బాలిక హత్య గావించబడి చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే.. వైసీపీ మాత్రం తన అనుకూల మీడియా ద్వారా అత్యాచారం అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అలాగే మైనర్ బాలిక ఉదంతాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ పుంగనూరుకు వస్తున్నట్లు సమాచారం అందిందని.. తన పరిపాలనలో మహిళలపై అఘాయిత్యాలు.. అత్యాచారాలు జరిగిన సమయంలో జగన్ ఎవరినైనా పరామర్శించారా అంటూ హోం మంత్రి అన్నారు.

సాక్షాత్తు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో.. వైసిపి ప్రభుత్వ కాలంలోనే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయని.. తాను భాదితులను పరామర్శించడానికి వెళితే తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు. దయచేసి ఆడపిల్ల విషయాన్ని రాజకీయంకు వాడుకోవద్దంటూ వైసీపీకి హితవు పలికారు. బాలిక కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు ముగ్గురు మంత్రులు పుంగనూరుకు వచ్చినట్లు.. రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ వ్యవహరించడం తగదన్నారు. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండ, రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి అన్నారు.

Related News

Minister Durgesh: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్

AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..

Politics: ఔను వారిద్దరూ కలిశారు.. ఒకరేమో సీఎం.. మరొకరేమో మాజీ సీఎం.. భేటీ అందుకేనా ?

Deputy CM: రేపు కేంద్రం సమావేశం.. నేడు పవన్ తో భేటీ.. అసలేం జరుగుతోంది ?

AP Govt: రేపే వారి ఖాతాల్లో నగదు జమ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. చెక్ చేసుకోండి..

Crime: ఆహా ఏమి అందం.. ఏమి చందం.. లుక్ సూపర్.. కట్ చేస్తే మత్తు.. ప్రవేట్ వీడియోలు.. ఆ తర్వాత..?

×