EPAPER

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Airtel Xstream AirFiber : నెట్వర్క్ స్పీడ్ గా విస్తరిస్తున్న ఈ కాలంలో హై స్పీడ్ డేటాతో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫ్మామ్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా ఓ భాగమైపోయింది. అందుకే ప్రముఖ టెలికాం సంస్థలన్నీ వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు పలు ఓటీటీ ఫ్లాట్ ప్లాట్ఫామ్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్స్ ను తీసుకోవాల్సిన నేపథ్యంలో… తాజాగా భారతీ ఎయిర్టెల్ మరో మూడు సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.


భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా కొత్త నగరాల్లో తన ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ను విస్తరిస్తుంది. హై స్పీడ్ నెట్వర్క్ ద్వారా మరింతగా తన సేవలను కస్టమర్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా 3 ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఓటీటీ ప్రయోజనాలతో పాటు డేటా స్పీడ్ ను సైతం పెంచింది.

ఎయిర్టెల్ తాజాగా తీసుకొచ్చిన మూడు ప్లాన్స్ లో రెండు రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఓటీటీ.. రెండోది నాన్ ఓటీటీ. వీటిలో 40 ఎమ్బిపీఎస్, 100 ఎమ్బిపీఎస్ వేగంతో పలు ప్లాన్స్ ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకున్న హై  డేటా స్పీడ్ తో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్స్ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.


ALSO READ : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

మూడు ఫైబర్ ప్లాన్స్  రూ.699, రూ. 799, రూ.899గా ఉన్నాయి. వీటిలో రూ.699 ప్లాన్ లో  40 mbps డేటాతో పాటు 1టీబీ డేటాను ఇస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, ఆహా, ఈరోస్ నౌ, షెమరూమీ, లయన్స్‌గేట్ ప్లే, సన్‌ఎన్‌ఎక్స్‌టి, చౌపాల్, అల్ట్రా  OTT ప్రయోజనాలను అందిస్తుంది. ఇక ఉచిత సెటప్ బాక్స్ ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.

రూ. 799 ప్లాన్ లో 100 mbps  డేటాతో పాటు 1టీబీ డేటాను ఇస్తుంది. ఈ ప్లాన్ లో వినోదానికి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ అందించట్లేనట్టు ఎయిర్ టెల్ తెలిపింది.

ఇక రూ.899 ప్లాన్లో వినియోగదారులకి 100 mbps స్పీడ్, 1టీబీ డేటా వస్తుంది. ఇక వీటిలో టాప్ మోస్ట్ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి, డిస్నీ హాట్ స్టార్, సోనీ, ది లయన్ సో గెట్, ప్లే సన్ నెక్స్ట్, ఇయర్ రోస్ వంటి ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి.  వీటితో పాటు ఉచిత సెటప్ బాక్స్ సైతం రానుంది.

టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుండగా స్పామ్ కాల్స్ ముప్పు సైతం అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎయిర్టెల్ కొత్తగా ఆర్టిఫికెట్ ఇంటెలిజెన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే స్కాన్ డిటెక్షన్ విధానాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు స్పాన్ కాల్స్ వచ్చినా మెసేజ్లు వచ్చినా ఈ వ్యవస్థ హెచ్చరిస్తుంది. ఇక ఈ సర్వీస్ ను ఎయిర్టెల్ తన కస్టమర్స్ కు ఉచితంగా అందిస్తుంది.

Tags

Related News

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

×