EPAPER

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

TG Govt: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 25 ఎకరాల్లో పాఠశాల.. సాంకేతిక పరిజ్ఞానంతో విద్య.. చదువు పూర్తి చేసుకున్న సమయానికి అవకాశాలు.. ఇటువంటి పెద్ద ప్రణాళికతో విద్యాపథంలో రాణించేందుకు ముందడుగు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఉచిత విద్య రూపేణా ఇన్ని అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి.. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం.


తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంకు రేవంత్ సర్కార్ ముందడుగు వేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Deputy CM Mallu Bhattu Vikramarka) ప్రకటించారు. ఈ స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతను మీడియాకు డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నిధులతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, విద్యా ప్రమాణాల పెంపుకు ఈ స్కూల్స్ దోహదపడతాయన్నారు.

ఈ స్కూల్స్ నిర్మాణం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో 20-25 ఎకరాల్లో సాగుతుందని, 12వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే భూమి వివరాల సేక‌ర‌ణ‌ పూర్తయిందని, త్వరలోనే వీటి నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ క్రీడలు, వినోదంతో సహా ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి విద్యార్థులు శాటిలైట్ ఆధారిత విద్య అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు.. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో చర్చించడం జరిగిందన్నారు.


అలాగే రాష్ట్రంలోని గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో విద్యా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన అన్ని అంశాలపై దృష్టి సారించామన్నారు. ఇలా ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంకు ముందడుగు వేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్ తరాలకు తరగని నిధిలా ఉత్తమ విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని విద్యావేత్తలు తెలుపుతున్నారు.

Also Read: Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

అయితే యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం పూర్తయితే చాలు.. లక్షలాధి రూపాయలు వెచ్చించి, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గినట్లే. అది కూడా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడంతో.. నేటి ఆధునిక కాలానికి తగిన విద్యాబోధన అందిచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దసరా ముందు రోజు ఈ స్కూల్స్ నిర్మాణాలకు శంఖుస్థాపన కార్యక్రమంను ప్రభుత్వం నిర్వహించనుంది. అలాగే అతి త్వరగా వీటి నిర్మాణాలు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం తలపించినట్లు తెలుస్తోంది. మరి అదే జరిగితే.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో నిండి పోతాయని చెప్పవచ్చు.

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×