Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ సేల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు ఉండే గిరాకీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారత మార్కెట్లో మరింత డిమాండ్ ఎక్కువ. అందుకే ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విడుదల చేసి వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. అయితే వీటిలో శాంసంగ్ డివైజ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఎందుకంటే ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆకర్షణీయమైన డిజైన్‌తో సూపర్ ఫీచర్స్‌తో తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేస్తుంటుంది. అలా ఇప్పుడు రీసెంట్గా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే అంతకుముందే గతేడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ లాంఛ్ అయింది. దీంతో చాలా మంది ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్? అని శాంసంగ్ ప్రియులు, వినియోగదారుల్లో చిన్న గందరగోళం నెలకొంది. అందుకే మన కథనంలో ఈ స్మార్ట్ ఫోన్లను కంపేర్ చేసి, ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఎందులో ఎక్కువ ఉన్నాయి? వంటి వివరాలను స్పష్టంగా తెలుసుకుందాం. తద్వారా ఏది కొనాలో ఎంచక్కా ఓ స్పష్టతకు రావొచ్చు.
ALSO READ : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్స్ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!
Samsung Galaxy S 24 FE VS Samsung Galaxy S 23 FE
డిస్ప్లే, డివైస్ ఎలా ఉందంటే? – మొదటగా ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిజైన్, డిస్ ప్లే గురించి తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ గ్లాస్ రియర్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చాయి. అయితే గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ బాక్సీ డిజైన్, కర్వ్డ్ ఎడ్జెస్‌తో ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్ 24లాగా ఉంటుంది. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఐపీ 68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ 6.69 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఇక గతేడాది విడుదలైన గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ 6.4 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది.
కెమెరా ఫీచర్స్ ఇవే – Galaxy S 24 FE, Galaxy S 23 FE.. రెండు కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంఛ్ అయ్యాయి. కెమెరా మంచి క్వాలిటీతో పని చేస్తుంది. వీటిలో వెనకవైపు 50 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో మెయిన్ కెమెరా ఉంది. 8 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండటం విశేషం. 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ రెండు స్మార్ట్ ఫోన్స్ 10 మెగా పిక్సెల్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? - బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈలో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఎస్ 23 ఎఫ్ఈలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ 25 వాట్ ఛార్జ్‌ను సపోర్ట్ చేస్తాయి.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ల పనితీరును, స్పెసిఫికేషన్లను పోల్చినప్పుడు గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈలో 8 GB ర్యామ్, 256 GB వరకు స్టోరేజ్ ఉంది. అలానే ఎక్సినోస్ 2400ఈ ఎస్ఓసీ ఉంది. బెస్ట్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ కోసం ఎక్స్‌క్లిప్స్ 940 GPUను ఇచ్చారు. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ 8 GB ర్యామ్ – 256 GB స్టోరేజ్‌తో పని చేస్తుంది. ఎక్సినోస్ 2200 ఎస్ఓసితో పాటు ఎక్స్‌క్లిప్స్ 920 జీపీయూను అమర్చారు.
ధర ఎంత ఉందంటే? – శాంసంగ్ Galaxy S 24 FE 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.59,999గా ఉంది. శాంసంగ్ Galaxy S 23 FE ప్రారంభ ధర రూ.54,999గా నిర్ణయించారు. మొత్తానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మంచిగా పని చేస్తాయని చెప్పొచ్చు.