EPAPER

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Festival Sale : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ స్టార్ట్ చేసిన ఆన్లైన్ షాపింగ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ను విపరీతంగా కొనేసిన కస్టమర్స్… తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించారు. శర వేగంగా జరిగిన ఆన్లైన్ సేల్స్ లో తొలి వారంలోనే వేల కోట్లలో షాపింగ్ జరిపినట్లు తాజాగా జరిపిన నివేదిక తెలిపింది.


అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సెల్ ను ఎంతో గ్రాండ్ గా ప్రారంభించాయి. ఈ సేల్లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, గృహ ఉపకరణాలపైన భారీ డిస్కౌంట్ను ప్రకటించాయి. ఐఫోన్ తో పాటు ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ను అందించాయి. ఇక సేల్ కొనుగోలులో వీటిపై డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 26న సేల్స్ మొదలుపెట్టాయి. ఈ సేల్స్ లో తొలి వారంలోని రూ. 54 వేల కోట్ల విలువైన అమ్మకాలు జరిపినట్లు డాటుమ్ ఇంటిలిజెన్స్ అనే సంస్థ సర్వే చేసి తెలిపింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన సేల్స్ లో రూ.54 వేల కోట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది.

ఇక 2023 ఫెస్టివల్ సేల్ తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 26 శాతం పెరిగినట్టు డాటుమ్ ఇంటిలిజెన్స్ చెప్పుకొచ్చింది. మొత్తం అమ్మకాల్లో 60% కు పైగా ఎలక్ట్రానిక్స్ దేనని తెలిపింది. వీటితో మొబైల్ ఫోన్స్ వాటా 38% కాగా ఇతర ఎలక్ట్రానిక్స్ 21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఐఫోన్ 15 తో పాటు ఆపిల్ నుంచి వచ్చిన పాత మోడల్ మెుబైల్స్ కు సైతం మంచి గిరాకీ ఉన్నట్టు తెలిపింది. ఇక సాంసంగ్ నుంచి అతి తక్కువ ధరలో వచ్చిన గెలక్సీ s28 ఎఫ్ఏ ఫోన్ కు సైతం భారీ వచ్చిందని… ఈ ఫోన్ ను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారని తెలిపింది.


ALSO READ : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

ఫెస్టివల్ సెల్లో ప్రీమియం మొబైల్స్ కు మంచి డిస్కౌంట్ లభించింది. వీటిని కొనేందుకు కస్టమర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా రూ. 30 వేలకు పైబడిన స్మార్ట్ ఫోన్స్ కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపించారని తెలిపింది. ఇక గృహ ఉపకరణాలుకు మంచి డిమాండ్ ఉందని… డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీలకు సైతం మంచి డిమాండ్ వచ్చిందని చెప్పింది. ఇక కొనుగోలుదారులు ఎక్కువ మంది ఈఎమ్ఐ ఆప్షన్ను ఎంచుకున్నారని… చిన్న చిన్న పట్టణాలతో పాటు నగరాల నుంచి ఎక్కువ ఆఫర్స్ వచ్చాయని తెలిపింది.

ఇక ఈ సంస్థ నివేదిక జరిపిన టైప్ 2, టైప్ 3 నగరాల నుంచి 70% కొనుగోళ్లు వచ్చాయని తెలిపింది. స్మార్ట్ టీవీలపై సైతం 80% కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. ఈ ఫెస్టివల్ సెల్లో పూర్తి అమ్మకాలు రూ. లక్ష కోట్లకు పైగానే జరగవచ్చు అని సంస్థ తెలిపింది. ఇక గత ఏడాది ఫెస్టివల్స్ లో రూ. 81వేల కోట్ల సేల్స్ జరిగాయి. ఈ దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్ మరి కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. మరి చివరకు సేల్స్ ఎన్ని లక్షల కోట్లు జరుగుతాయో చూడాలి.

Related News

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

×