EPAPER
Kirrak Couples Episode 1

Ranga : పోటాపోటీగా రంగా వర్ధంతి కార్యక్రమాలు.. రాధా ఎటు వైపు?

Ranga : పోటాపోటీగా రంగా వర్ధంతి కార్యక్రమాలు.. రాధా ఎటు వైపు?

Ranga : వంగవీటి రంగా వర్ధంతి వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆదివారం రంగా తనయుడు రాధాతో కలిసి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎంపీ బాలశౌరి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేదికపై టీడీపీని టార్గెట్ చేస్తూ కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధాతో కలిసి వైసీపీ నేతలు రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆసక్తిగా మారింది. రాధా మళ్లీ పార్టీ మారతారనే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఆదివారం వైసీపీ నేతలతో కలిసి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాధా.. తాజాగా విజయవాడలో టీడీపీ, జనసేన నేతలతో కలిసి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్ తో కలిసి రంగా విగ్రహానికి రాధా పూలమాలలు వేశారు. పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగా అని రాధా అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానన్నారు.

ఇదే సమయంలో టీడీపీ, జనసేన నేతలు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం వాడుకుని కొంతమంది రాధాకృష్ణను‌ వదిలేశారని బోడే ప్రసాద్ మండిపడ్డారు. ఇప్పుడు ఏదో మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ఆరాట పడుతున్నారన్నారు. రాధాకృష్ణను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వంగవీటి రాధాకృష్ణకు మద్దతుగా నిలవాలని కోరారు.


రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం‌ చేశారని పోతిన మహేష్ ఆరోపించారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్‌లు చెబుతున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని సీటు ఇవ్వకపోతే జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రంగా కొడుకుకు చేసిన అన్యాయాన్ని అభిమానులు ఎవరూ మరచిపోలేదన్నారు. రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా.. జగన్ స్పందించ లేదని పోతిన మహేష్ ప్రశ్నించారు. రంగా పేరు చెప్పుకునే వైసీపీ నేతలు కనీసం స్మృతి వనం కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

అటు రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోగానీ, ఇటు రంగా వర్ధంతి కార్యక్రమంలో గానీ రాధా తన తండ్రి గురించి చెప్పారే కానీ రాజకీయంగా తన స్టాండ్ ఎంటో చెప్పలేదు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా జనసేనలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. మరోవైపు వైసీపీ నేతలు టచ్ లో ఉండటంతో మళ్లీ ఫ్యాన్ కిందకి చేరతారనే అనే అనుమానాలు వ్యక్తమవయ్యాయి. 2004 తొలిసారి ఎమ్మెల్యే అయిన రాధా వరసగా తప్పిదాలు చేస్తూ తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 లో వైసీపీ నుంచి పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇలా మూడు ఎన్నికల్లో రాధా మరో అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇప్పటికీ తను ఏ పార్టీలో ఉండాలో తేల్చుకోలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

గుడివాడ రణరంగం..
రంగా వర్ధంతి కార్యక్రమాల నేపథ్యంలో ఆదివారం రాత్రి గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు , మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అనుచరులు రణరంగం సృష్టించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు.. టీడీపీ కార్యాలయంపైకి దూసుకొచ్చి పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు యత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి చంపేస్తామని హెచ్చరించారని మండిపడ్డారు. కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ ఆధ్వర్యంలో ఈ దౌర్జన్యకాండ కొనసాగిందని, పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని ఆరోపించారు. ఈ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జి చేయడంపై మండిపడ్డారు. వంగవీటి రంగా వర్ధంతిని గుడివాడలో టీడీపీ తరఫున నిర్వహించొద్దని కాళీ హుకుం జారీ చేశారని రంగా.. ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆయన బడుగు, బలహీనవర్గాల మనిషని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీ నేతలే తమపార్టీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు రంగా చుట్టూ రాజకీయం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ,జనసేన రాధాను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరి రాధా రాజకీయ అడుగులు ఎటు వైపు వేస్తారో చూడాలి మరి.

Related News

SIT Inquiry on Tirumala laddu: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

YS Jagan: బెడిసికొట్టిన జగన్ ప్లాన్.. అడ్డంగా దొరికాడు?

Posani: డర్టీ పాలిటిక్స్.. రంగంలోకి పోసాని, వైసీపీకి ఇక వాళ్లే దిక్కా?

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Big Stories

×