EPAPER

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Throat pain: వాతావరణం చల్లబడిన వెంటనే గొంతు నొప్పి మొదలైపోతుంది. గొంతులో దురద, చికాకు ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మింగేటప్పుడు గొంతు నొప్పి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాల ద్వారా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు.


గొంతు నొప్పిని ఫారింగైటిస్ అంటారు. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి వైరస్, ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. స్టెప్ థ్రోట్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కలగవచ్చు. అలెర్జీ కారకాలైన పొగ, కాలుష్యం, పుప్పొడి వంటివి చేరడం వల్ల కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని ఆయుర్వేద పద్ధతుల్లో గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు.

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కలిపి రోజుకు నాలుగైదు సార్లు పుక్కిలించడం వంటివి చేయండి. ఇది గొంతు దగ్గర ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.


గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇలా తాగితే ప్రశాంతంగా గొంతు నొప్పి లేకుండా నిద్రపోగలరు. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

 

అల్లంలో సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. అల్లం ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కాబట్టి అర స్పూను అల్లం రసంలో అర స్పూను తేనె కలుపుకొని రోజులో రెండు మూడు సార్లు తాగుతూ ఉండండి. ఇది మీకు మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

తులసి ఆకులతో టీ పెట్టుకుని తాగి చూడండి. మీ గొంతుకు ఉపశమనంగా అనిపిస్తుంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను పరిశుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి బాగా మరిగించి వడకట్టండి. ఇది మీ గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

 

నెయ్యిలో అల్లం రసము, చిటికెడు పసుపు వేసి కలిపి మింగేయండి. ఇది గొంతులో మంట, దురద రాకుండా అడ్డుకుంటుంది.

Related News

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

×