EPAPER

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Good News for Residential schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రులు కోమటి రెడ్డి, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మీడియా ముందు వివరాలు తెలిపారు.


తెలంగాణలోని ఎన్నో ప్రాంతాల్లో ఉన్న రసిడెన్షియల్ స్కూళ్లకు సరైన భవనాలు లేవని ఆయన అన్నారు. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్స్‌ని ప్రారంభం చేశామని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆయా శాసన సభ నియోజక వర్గాల్లో 25 ఎకరాల స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను 5 వేల కోట్ల బడ్జెట్‌ను స్కూళ్లకు కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. పేద, బడుగు బలహీనవర్గాలకు ఉచిత విద్య అందించాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరితగతిన స్థలం సేకరించి ఈ సంవత్సరంలో మొదలు చేయాలని ప్రాథమికంగా 22 నియోజక వర్గంలో మొదలు చెయపోతున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు 20-25 స్కూళ్లకు సంబంధించిన వివరాలను కలెక్టర్లు తమకు పంపించారని, పైలట్ ప్రాజెక్టు కింద వాటి పనులను చెపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల గురుంచి గతంలోనే ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే పోటీ పడేటట్టు ఉంచుతాం అని ఆనాడే చెప్పామన్నారు. ప్రజంటేషన్ ద్వారా స్కూల్ నమూనా చేపట్టనున్నారు. సీనియర్ అధికారులతో కలిపి కమిటీ వేసి 3 నెలలు కష్టపడి ఈ ప్రణాళిక రూపొందించుకొని విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు. కొంతమంది కోమటి రెడ్డి వెంకటరెడ్డి దృష్టికి చాలా మంది విద్యార్థులు మా స్కూల్ లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. వారి అందరికీ భరోసా ఇస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓపెన్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేవలం విద్య మాత్రమే కాదు.. క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు.


Also Read: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

అన్ని వర్గాల వారికి ఇంటర్నేషనల్ స్టాండెడ్ లో ఈ స్కూల్‌లో విద్య అందిస్తామని, నాకు అవకాశాలు లేవు అనే భావన ఎవరికి కూడా ఉండొద్దు భట్టి విక్రమార్క తెలిపారు. అవసరం అయితే అంపి థియేటర్ ద్వారా సినిమాలు ప్రదర్శిస్తామని ఏదీ కూడా మిస్ అవుతున్నా అని భావన ఉండొద్దు అని భట్టి తెలిపారు. దసరా కంటే ముందు భూమి పూజ చేయన్నున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Related News

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

×