EPAPER

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Hyderabad Police Arrested 18 Cyber Criminals: ముంబై కేంద్రంగాసైబర్ మోసాలకు పాల్పడుతున్న 18 మంది నేరగాళ్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 435 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరందరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు.


వీరిపై రాష్ట్రంలో 35కు పైగా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందుతులు నుంచి రూ.ఐదు లక్షల నగదు, 26 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను గుర్తించారు. నిందుతులు దేశవ్యాప్తంగా లైంగిక టార్షన్, కొరియన్, పెట్టుబడి వంటి వివిధ రకాల మోసాలకు పాల్పడుతూ.. విదేశాల్లో ఉన్నసైబర్ మాఫియా కోసం కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.1.61 కోట్ల నగదు సీజ్‌ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయిన కేసుల్లో చూస్తే.. బాధితుల నుంచి వీళ్లు రూ.6.94 కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరివెనక నుండి నడిపిస్తున్న ముఠా సభ్యులు కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.


Also Read: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

సీబీఐ ,ఈడి డ్రగ్స్ , కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. డబ్బులు కాజేస్తున్నారు ఈ కేటుగాళ్లు. నిందితుల ఖాతాల్లో ఉన్న నగదు సీజ్ చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్‌ను రెస్పాండ్ కావద్దని, ఏదైనా అనుమానం ఉంటే పోలీసులను ఆశ్రయించాలి సీపీ ఆదేశించారు.

 

Related News

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

×