EPAPER

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

GST: మనదేశంలో బీమా రంగం అనగానే ముందుగా గుర్తొచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ). 2024 సెప్టెంబర్‌ 1 నాటికి ఈ సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగుపెట్టింది. జీవిత బీమా రంగంలో ప్రజల సొమ్ము ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే ఈ రంగాన్ని జాతీయం చేయాలంటూ 1951లో అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆరేళ్ల పాటు చేసిన పోరాటాల ఫలితంగా, నాటి ప్రధాని నెహ్రూ 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చారు. కేవలం రూ. 5 కోట్ల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకోవటమే గాక, ఏటా రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వానికి అందించే స్థాయికి ఎదిగింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ – 2024 తాజా నివేదిక ప్రకారం ఎల్‌ఐసీ, బలమైన బ్రాండ్‌గా ప్రపంచంలో తొలి ర్యాంకును సాధించగా, 2023 ఫార్చ్యూన్‌ ప్రపంచ సూచీలో 107వ ర్యాంక్‌‌ను పొందింది. అంతేగాక, మొత్తం ప్రీమియ ఆదాయంలో ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది.


Also Read: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

ఏ బీమా సంస్థ పనితీరును దాని క్లెయిం హిస్టరీని బట్టి నిర్ణయిస్తారని తెలిసిందే. ఈ విషయంలో 99 శాతంతో ఎల్‌ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల క్లెయిమ్స్‌ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ 70 శాతానికి పైగా మార్కెట్‌ షేర్‌తో ఎల్‌ఐసీ మార్కెట్‌ లీడర్‌గా ఉంది. సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 3 లక్షల మంది మహిళలే. మొత్తం ఏజెంట్లలో సగం మంది గ్రామీణ ప్రాంతాల వారే కావటం విశేషం. ఎల్‌ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్‌ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్‌ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. ఎల్‌ఐసీ చట్టం, 1956లోని సెక్షన్‌ 37 ప్రకారం ఎల్‌ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. దీని ప్రకారం పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోనస్‌లకు కేంద్రం గ్యారంటీ ఇస్తుంది. కానీ ఈ 68 ఏళ్లలో ఒక్క సందర్భంలోనూ ఎల్‌ఐసీ ఈ గ్యారెంటీని వాడుకోలేదు. చివరికి.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా సంస్థలను అమెరికా ప్రభుత్వం ఆదుకోవాల్సి వచ్చినా, ఎల్‌ఐసీ ఆర్థికంగా నానాటికీ బలపడుతూనే వచ్చింది.


Also Read: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

ఆర్థికంగా ఇంత పటిష్టమైన స్థితిలో ఉన్న ఈ సంస్థను కేంద్రం నిర్వీర్యం చేసేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తోంది. బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్‌ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, కేంద్రం స్పందించలేదు. అయితే, దీనిపై నితిన్ గడ్కరీ, సుబ్రమణ్యస్వామి వంటి సొంతపార్టీ మంత్రులు కూడా నోరువిప్పటం, మధ్యతరగతి నుంచి నిరసన వ్యక్తం కావటంతో వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు. బీమా ప్రీమియం మీద ఇకనైనా కేంద్రం జీఎస్టీని రద్దుచేస్తే, ప్రజలు మరింత మదుపుకు ముందుకొస్తారు. ఇది అటు దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచటమే గాక, సంస్థ భవిష్యత్తుకూ మంచిది. మరోవైపు, వనరుల సేకరణ పేరుతో ఎల్‌ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరమైన ఆలోచన కాదు. ఏటా రూ. 4 లక్షల కోట్లు కేంద్రానికి అప్పుగా ఇచ్చే బలమైన సంస్థగా ఉన్న ఎల్‌ఐసీలో ప్రభుత్వ పెట్టుబడి కొనసాగితేనే, మదుపుదారుల్లో విశ్వాసం నిలబడుతుంది. లేకుంటే సంస్థ విశ్వసనీయత దెబ్బతింటుంది. సుమారు ఏడు దశాబ్దాల పాటు దేశ మదుపుదారుల విశ్వాసాన్ని పొందిన సంస్థను కాపాడుకోవటమంటే ఈ దేశపు పేద, మధ్యతరగతికి ఆర్థిక భద్రతను కల్పించటమేనని పాలకులు అర్థం చేసుకోవాలి.

Related News

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×