EPAPER

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. లక్షలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే సీఎం చంద్రబాబు దంపతులు సాంప్రదాయం ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఇటీవల తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్త చర్చకు దారితీసిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. అయితే లడ్డు వ్యవహారం యొక్క వాస్తవాలు వెలికి తీసేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.


కాగా.. ప్రస్తుతం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. తొలిరోజు ధ్వజస్తంభం కొక్కి విరిగినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. చివరికి టీటీడీ కొక్కి విరిగి ఎటువంటి అపశృతి చోటుచేసుకోలేదని ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తిరుమలకు సంబంధించిన ప్రతి విషయంపై యావత్ భారత్ చర్చకు దారి తీస్తున్న నేపథ్యంలో కొక్కి విరిగినట్లుగా ప్రసారమైన వార్తల పట్ల ముందు చర్చలు ఊపందుకున్నా.. టీటీడీ ప్రకటనతో తెరపడింది.

ఇక శనివారం ఏకంగా శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ కనిపించిందన్న వార్తలు హల్ చల్ చేశాయి. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తింటుండగా.. జర్రి కనబడిందని వరంగల్ కు చెందిన భక్తులు ఆరోపించారు. వెంటనే టీటీడీ సిబ్బంది అక్కడికి చేరుకొని అసలు విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. చివరికి ఆకులో వచ్చిందో.. లేక పెరుగులో వచ్చిందో.. అన్నప్రసాదంలో వచ్చిందో అంటూ భక్తులు పలు రకాలుగా టీటీడీపై విమర్శలు చేశారు.


Also Read: Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

ఈ విషయంపై టీటీడీ తాజాగా స్పందించింది. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ కనిపించిన వార్తను టీటీడీ కొట్టిపారేసింది. అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని ప్రకటన విడుదల చేసింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరమని తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి వారు అన్నప్రసాదాలను తయారుచేస్తారు.

అంత వేడిలో ఏమాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరంగా ఉందని టీటీడీ తెలిపింది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది.. పూర్తిగా కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తుందన్నారు. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Related News

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×