EPAPER

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Social Media trolling war TDP and YSRCP: తిరుపుతి లడ్డూ విషయమై నెలకొన్న వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో దీనిపై విచారణ కొనసాగుతుంది. వైసీపీ, కూటమి ప్రభుత్వం మధ్య దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. గత పాలకుల కారణంగానే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు విమర్శిస్తున్నారు. మరోపక్క తమ హయాంలో అలాంటిదేమీ జరగలేదు.. కావాలనే కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందంటూ ఆరోపిస్తున్నారు. ఆఖరకు తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి.. అత్యంత పవిత్రమైన ప్రసాదం పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇదిలా ఉంటే ఈ వార్ మరో కొత్త రూపం దాల్చింది. అది కాస్త అక్షింతల రూపం దాల్చి.. సోషల్ మీడియాకు వెళ్లింది. నెట్టింటా ఇప్పుడు దీనిపై రాజకీయ వార్ కొనసాగుతుంది.


Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ పార్టీ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో జగన్ ను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో జగన్ తిరుమలకి వెళ్లి స్వామివారి దర్శించుకున్న సందర్భంగా పూజారులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జగన్ కు వారు మెడలో శాలువాను వేసి, తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ సందర్భంగా ఆయన జుట్టును సరి చేసుకున్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ఆయనపై ఫైరయ్యారు. శ్రీవారి అక్షింతలు తలపై ఉండడానికి కూడా జగన్ ఇష్టపడడంలేదంటూ అందులో పేర్కొన్నారు. ‘నీకు సాయంత్రం 6 దాటితే కళ్లు కనిపించవ్ కదా.? ఇప్పుడు ఈ రోగం పగటి పూట కూడా వచ్చిందా? అయినా స్వామివారు అంటే నమ్మకం లేక, ఒక్క అక్షింత కూడా లేకుండా మొత్తం కిందపడేసిన నీ లాంటి సైకో గురించి ప్రతి హిందువుకు తెలుసు కదా జగన్?’అంటూ అందులో పేర్కొన్నారు.


ఆ పోస్టును విమర్శిస్తూ వైసీపీ పార్టీ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ ను పెట్టారు. ‘మీ చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. కాబట్టే కదా.. దేవుడి ప్రసాదంపైన నిర్లజ్జగా తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. మొన్న సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. జనం ఉమ్మేస్తున్నా.. తుడుచుకుని మళ్లీ ఇలా ఫేక్ ప్రచారం చేస్తావ్. ఎందుకంటే నీ బతుకే ఒక ఫేక్ కదా@JaiTDP’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

అయితే, ఆ వీడియోలో తిరుమలకు వెళ్లిన జగన్ కు పూజారులు ఆశీర్వచనం చేశారు. ఆ క్రమంలో ఆయన తన జుట్టును సరిచేసుకున్నారు. ఆ తరువాత పూజారులు ఆయన మెడలో శాలువాను వేశారు. అనంతరం ఆయన తలపై అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత వారు అందించిన ప్రసాదాన్ని సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీవారికి జగన్ నమస్కరించి ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తలపై అక్షింతలు ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, టీడీపీ వాస్తవాలను ఫేక్ చేస్తుందంటూ వైసీపీ అందులో పేర్కొన్నది. ఈ వీడియో నెట్టింటా భారీగా వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్స్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×