EPAPER

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

Telangana to exports rice to Philippines: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అభివృద్ధే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుంది. గత సర్కారు హయాంలో సాధ్యం కాదు అనుకున్నవాటిని ప్రస్తుత ప్రభుత్వం సాధ్యం చేసి చూపిస్తుంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి ప్రభుత్వం చాలా ప్రిపరెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర రైతులకు పంట రుణాలను మాఫీ చేసింది. అదేవిధంగా వారికి రానున్న పంటకు రూ. 500 బోనస్ కూడా ఇస్తామంటూ ప్రకటించింది. వీటితోపాటు రైతు భరోసా విషయం కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకు సంబంధించి రైతులు, ప్రజలు, ప్రముఖలతో చర్చలు జరుపుతుంది. ఇవే కాకుండా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం మరో అడుగు ముందడుగు వేసింది. అదేమంటే.. మన తెలంగాణ బియ్యాన్ని మరో దేశానికి ఎగుమతి చేసేందుకు సిద్ధమయ్యింది. అందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా చర్చలు జరిగాయి. ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు సఫలమయ్యాయి.


Also Read: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

ఫిలిపిన్స్ దేశానికి బియ్యం ఎగుమతి చేసే విషయమై ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రితో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం పౌర సరఫరాల భవన్ నుంచి ఆయన చర్చించారు. 3 ఎల్ఎమ్టీ వరకు ఆ దేశానికి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలపై చర్చించారు. ఈ విషయమై ముందుగా సివిల్ సప్లైస్ అధికారులు, పలువురు నిపుణులతో చర్చించారు. అనంతరం ఫిలిప్పిన్స్ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రోజేర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వకంగా మరియు సానుకూల వాతావరణంలో కొనసాగాయి.


Also Read: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

అయితే, నాణ్యత కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్ని ఏళ్లుగా భారతదేశం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసుకోవడం నిలిపివేశారంటూ ఆ చర్చల్లో ప్రస్తావించారు సదరు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బియ్యం గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలు పూర్తిగా సఫలంగా కొనసాగాయని, త్వరలోనే తెలంగాణ బియ్యం ఫిలిప్పియన్లకు ఎగుమతి కానున్నాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు సఫలమైనందునా.. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతో తెలంగాణ పౌర సరఫరాల శాఖకు, తెలంగాణ ప్రజలకు ఇదో మంచి శుభపరిణామం అంటూ మంత్రి ప్రస్తావించారు. కాగా, తెలంగాణ బియ్యం కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ ఆ దేశానికి ఎగుమతి కానున్నందున తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

×