EPAPER

Viral video: ఈ బుడ్డోళ్లు తెల్లవారుజాము 3.50కే నిద్రలేస్తారట, వారి పేరెంట్స్‌ ను తిట్టాలా? పొగడాలా?

Viral video: ఈ బుడ్డోళ్లు తెల్లవారుజాము 3.50కే నిద్రలేస్తారట, వారి పేరెంట్స్‌ ను తిట్టాలా? పొగడాలా?

Viral video: త్వరగా పడుకోవాలి. త్వరగా నిద్రలేవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు పెద్దలు. పిల్లల విషయంలో కాస్త మినహాయింపులు ఉంటాయి. చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా పడుకుంటే అంత మంచిది అంటారు. అయితే, ఓ తల్లి తన పిల్లలను తెల్లవారు జామున 3:50 కే నిద్రలేపుతుంది. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడంతో పాటు వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పద్దతి పాటిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. పొద్దున్నే నిద్రలేపడం నుంచి రోలర్ స్కేటింగ్ తరగతులకు తీసుకెళ్లడం మళ్లీ ఇంటికి తీసుకురావడం వరకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేసింది. ఆమె ఈ వీడియో షేర్ చేసిన కొద్ది సేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది.


చిన్నారుల వీడియోపై మిశ్రమ స్పందనలు

ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లల విషయంలో ఆమె వ్యహరిస్తున్న తీరుపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్టు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద బలవంతంగా మోపడం  మానుకోవాలని కొందరు సూచిస్తే, ఇంత త్వరగా పిల్లలను నిద్రలేపడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. కొంత మంది మాత్రం ఆమె మంచి పని చేస్తుందని ప్రశంసించారు.


Read Also:వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?

5 రోజుల్లో 6 మిలియన్ల వ్యూస్

‘శ్రీహన్ & శ్రేయస్ స్కేటర్స్  అనే  అనే హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “పొద్దున్నే లేచి మీ గోల్స్ ను ఛేజ్ చెయ్యండి” అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో 5 రోజుల క్రితం షేర్ చేయగా, ఇప్పటి వరకు 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. “పిల్లల విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా మంది వారి పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. కానీ, పద్దతి ప్రకారం  పెంచడం వల్ల ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

“ఇది కేవలం తల్లిదండ్రులు అత్యుత్సాహం మాత్రమే. వాళ్ల బాల్యాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్లు ఇప్పుడే 3 గంటలకు లేవాల్సిన అవసరం అంతకన్నా లేదు” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. “ మీ పిల్లలను బలంగా తయారు చేయాలనే  ఉద్దేశంతో వారిని హింసిస్తున్నారు. వాళ్లను బలవంతంగా వంచే ప్రయత్నం చేయకూడదు. మీ ఆలోచనలు వారి మీద రుద్దకూడదు. వారు ఎగరాలని ప్రయత్నిస్తే సాయం చేయలే తప్ప, బలవంతంగా ఎగిరేలా చేయడం మంచిది కాదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చారు. “ఈ నాన్సెస్ ఆపండి. వాళ్లు తమ కలలు సాకారం చేసుకునేందుకు చాలా సమయం ఉంది. వెంటనే ఈ హింసను ఆపండి” అని మరికొంత మంది రియాక్ట్ అయ్యారు.

Read Also:ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Related News

Divorce Man Carry Wife: విడాకుల విచారణ జరుగుతుండగా.. భార్యను కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి ఏమైదంటే..

Viral News: ఇల్లు అగ్గి పెట్టె అంత.. అద్దె రూ.45 వేలు, ఎక్కడో తెలుసా?

Viral Video: ‘బతుకు బండి‘ మీదే ప్రాణాలు విడిచి.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో!

Viral News: ట్రైన్ ఫర్ సేల్.. సీరియస్ బయ్యర్స్ మాత్రమే ట్రై చేయండి- సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో!

Vegetable Buying Guide: ‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Bus Train Crash Just Miss: బస్సును ఢీ కొట్టబోయిన రెండు రైళ్లు జస్ట్ మిస్.. అంతా గేట్ మెన్ నిర్వాకం..

×