EPAPER

Bengal: మైనర్ బాలికపై అత్యాచారం..? పోలీస్ క్యాంపునకు నిప్పు

Bengal: మైనర్ బాలికపై అత్యాచారం..? పోలీస్ క్యాంపునకు నిప్పు

Protesters set a police camp on fire in South 24 Parganas: పశ్చిమ బెంగాల్ లో వరుస ఘటనలు చోటు చోసుకుంటున్నాయి. విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ పై దుండగులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున డాక్టర్లు, ప్రజలు ఆందోళన చేశారు. ఆ రాష్ట్రంలోనే కాదు… దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు వినిపించాయి. దీనిపై సీబీఐ విచారణ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లిన మైనర్ బాలిక పొంటపొలాల్లో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు పోలీస్ క్యాంపునకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సౌత్ 24 పర్గనాస్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక శుక్రవారం ఇంటి నుంచి కోచింగ్ క్లాస్ కోసం బయటకు వెళ్లింది. అలా వెళ్లిన ఆ బాలిక మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అంతా వెతికారు. అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తెల్లవారుజామున 3 గంటలకు ఆ బాలిక పంటపొలాల్లో శవమై కనిపించింది. రక్తపుమడుగులు పడి ఉన్న ఆ బాలిక శరీరంపై తీవ్ర గాయాలను కుటంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపును ప్రారంభించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాలిక మృతికి కారణమైన వారిని వెంటనే కనిపెట్టి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తీవ్ర కోపంలో ఉన్న ఆందోళనకారులు స్థానికంగా ఉన్న పోలీస్ క్యాంపునకు నిప్పుపెట్టారు.


బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు క్లాస్ అయిపోగానే ఇంటికి వస్తానని తనతో చెప్పిందని, కానీ, తాను ఇంటికి వెళ్లి చూస్తే తన కూతురు కనిపించలేదని.. ఈ క్రమంలో తాము పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెల్లవారుజామున తన కూతురు పొంటపొలాల్లో శవమై కనిపించిందంటూ కన్నీరుమున్నరయ్యారు.

Also Read: 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..

పోలీసులు మాట్లాడుతూ..  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి 19 ఏళ్లున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర బీజేపీ నేతలు.. స్థానిక తృణమూల్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారంటూ స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో దుర్గా పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో రాష్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం పూర్తిగా విపలమయ్యిందంటూ వారు ఆరోపిస్తున్నారు.

అయితే, పోస్టుమార్టమ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని, అందులో వెల్లడైన విషయాల ప్రకారం తాము చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారని, బాలికపై అత్యాచారం జరిగిందా… లేదా ? అనేది ఆ రిపోర్టులో తేలనున్నాయని పోలీసులు చెప్పారంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

Related News

Fake SBI Branch: బాబోయ్.. ఈ కేటుగాళ్లు మరోలెవల్, ఏకంగా నకిలీ బ్యాంక్ పెట్టి లక్షలు కొల్లగొట్టారు!

Nima Hospital Murder: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..

Court Acquits POCSO Accused| 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..

Teenagers shoot Doctor: ఆస్పత్రిలో డాక్టర్‌ను హత్య చేసిన ఇద్దరు టీనేజర్లు.. చికిత్స కోసం వెళ్లి తుపాకీతో కాల్పులు

Viral News: ఉద్యోగం పోయిందని.. డ్రైవర్ ను పొడిచిన యువకుడు.. అలా చెప్పడమే తప్పైంది!

Student Attacks Teacher: నిద్రపోతున్న టీచర్ గొంతుపై రంపంతో దాడి చేసిన విద్యార్థి.. అందరిముందు ఆ టీచర్ ఏం చేశాడంటే..

×