EPAPER

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Hydra: తెలంగాణ ప్రభుత్వం ( TG Govt) ప్రవేశపెట్టిన హైడ్రాకు ఇక పూర్తి అధికారాలు వచ్చినట్లేనని చెప్పవచ్చు. కేవలం అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా (Hydra) ను జీవో99 పేరిట రేవంత్ ( Cm Revanth) సర్కార్ తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో గల అక్రమ కట్టడాలతో.. చిన్నపాటి వర్షాలకు సైతం వరదలను తలపించేలా వరద ముప్పు పొంచి ఉందన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం.. అక్రమ కట్టడాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది.


అయితే హైదరాబాద్ లో హైడ్రా (Hydra) పూర్తి స్థాయి పని మొదలుపెట్టి.. పలు కట్టడాలను నేరుగా కూల్చి వేసింది. అలాగే తన పని తాను చేసుకు పోతోంది. అయితే కూల్చివేతలకు ముందుగా బాధితులకు నోటీసులు జారీ చేయడం.. ఆ తర్వాత బాధితులు అక్రమ కట్టడాలు తొలగించని యెడల, హైడ్రానే వాటిని కూల్చేయడం చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా (Hydra) పై సోషల్ మీడియా వేదికగా.. పలు విమర్శలు సైతం వచ్చాయి. ఈ విమర్శలకు హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ సైతం ఘాటుగా రిప్లై ఇచ్చారు.

కాగా ఇటీవల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, హైడ్రాపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ విమర్శలు సైతం చేశాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించి, పూర్తి అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించుకుంది.


Also Read: Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

అకస్మాత్తుగా వచ్చే వరదలకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా.. తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సైతం సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ దశలో హైడ్రా (Hydra) కు చట్టబద్దత కల్పించి.. ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు సైతం వేసింది.

గత నెల 20వ తేదీన హైడ్రా (Hydra) కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించింది. అనంతరం కేబినెట్ ఆమోదం తెలపగా, ఆర్డినెన్స్ పై సంతకం కోసం హైడ్రా చట్టబద్ధత ఫైల్ ను రాజ్ భవన్ ( Raj Bhavan) కు ప్రభుత్వం పంపింది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసి ఆర్డినెన్స్ జారీ చేశారు. జారీ చేసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం గెజిట్ ను సైతం విడుదల చేసింది.

ఈ ఆర్డినెన్స్ 6 నెలల్లోనే చట్టంగా రూపొందే అవకాశాలు కనిపిస్తుండగా.. అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి హైడ్రాకు సభ్యుల ఆమోదం లభించిన అనంతరం.. ఇక చట్టబద్ధత హోదా హైడ్రా కు కలుగుతుంది. చట్టబద్దత లేదని గగ్గోలు చేసిన ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గేదెలే అనే రీతిలో హైడ్రా చట్టబద్దత దిశగా ముందడుగు వేసిందని చెప్పవచ్చు.

Related News

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

×