EPAPER

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Tirumala: తిరుమలకు వెళుతున్నారా.. అయితే శ్రీవారి దర్శనం ముగిశాక… మీ అనుభూతితో పాటు.. తిరుమలలో టీటీడీ (TTD)  సేవలు ఎలా ఉన్నాయి.. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అంటూ.. మీ అభిప్రాయం అడగనుంది టీటీడీ. ఇలా భక్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటే చాలు.. టీటీడీ సేవలలో లోటుపాట్లు తెలుసుకోవచ్చన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దేశం.


ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి వివాదం రాజుకోవడం, సుప్రీంకోర్టు జోక్యంతో ప్రత్యేక విచారణ కమిటీని నియమించడం మనకు తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం కోట్ల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించవద్దని పొలిటికల్ పార్టీలకు సూచనలు జారీ చేసింది. అయితే లడ్డు వ్యవహారానికి సంబంధించి దేశ వ్యాప్త చర్చ సాగిందని చెప్పవచ్చు. అందుకే ఏపీ ప్రభుత్వం, టీటీడీ (TTD) సంయుక్తంగా తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాయి.

ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) బ్రహ్మోత్సవాలు రాగా.. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దేశ, విదేశాల నుండి భక్తులు వస్తున్న సంధర్భంగా.. ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండ టీటీడీ అధికారులు శ్రద్ద చూపారు. కాగా ఆనవాయితీ ప్రకారం సీఎం చంద్రబాబు దంపతులు, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు, అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు జారీ చేశారు.


Also Read: Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

కలియుగ వైకుంఠం శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా ప్రతి భక్తుడు విశ్వసిస్తారు. అందుకే స్వామి వారి దర్శన భాగ్యం కలిగితే చాలు కదా అంటూ భక్తులు.. గోవిందా నామస్మరణ చేస్తూ.. నిశ్చలమైన భక్తితో తిరుమలకు చేరుకుంటుంటారు. అటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడమే టీటీడీ లక్ష్యం. అందుకే సీఎం చంద్రబాబు ఒక కొత్త విధానానికి తెర తీశారు. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించే భక్తుల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ.. టీటీడీకి కీలక సూచన జారీ చేశారు. అదేంటంటే.. తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడమే.

టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అధికారులను అడిగిన సిఎం… వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్న సిఎం, ఒక్క టీటీడీ (TTD) లోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.

ఇదే విధానం అమలైతే టీటీడీ (TTD) సేవలు మరింత మెరుగైన రీతిలో అందుతాయన్నది భక్తుల అభిప్రాయం. అన్ని దేవాలయాల్లో కూడా ఇదే పద్దతి అవలంబిస్తే.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావన్నది ప్రభుత్వ ఉద్దేశం. మరి త్వరగా తిరుమల (Tirumala) లో ఈ విధానం అమలైతే చాలు.. ఇంకేముంది ప్రతి భక్తుడు తన సలహాలు, సూచనలతో పాటు.. తిరుమలలో తాను ఎదుర్కొన్న సమస్యలు కూడా నేరుగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Related News

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

×