EPAPER

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

congress mla comments on rohit sharma captaincy: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌. అలాంటి రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. 17 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. 2027 నాటికి రోహిత్ శర్మ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. ఆ వయసులో హిట్ మ్యాన్ క్రికెట్ ఆడతాడా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఇదే అంశంపై తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవర్ స్పందించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా హిట్ మ్యాన్ కొనసాగాలని చెప్పాడు. భారత్ కు మరో టైటిల్ అందించాలని అన్నాడు. దానికి తగినట్టుగానే రోహిత్ శర్మ ఇటీవలే కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. తనలో ఇంకా చాలావరకు ఆట మిగిలే ఉందని… ఆటను ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటానని, కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకే టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పానని చెప్పాడు.


టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా హిట్ మ్యాన్ కు సపోర్ట్ గా నిలిచాడు. ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ లోను రోహిత్ శర్మ ఆట ఆడవచ్చని, కెరియర్ పై హిట్ మ్యాన్ ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రోహిత్ శర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఆటను ఆడుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ సమయం నుంచి మరో లెవెల్ ఆటను చూపిస్తున్నాడు. అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో కట్టిపడేస్తున్నాడు. తనే బాధ్యతను తీసుకుంటున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ చాంపియన్స్ ట్రోఫీ పైనే ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇప్పటివరకు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవలేకపోయింది.

గత రెండు సార్లు ఫైనల్స్ కు చేరిన టైటిల్ అందుకోలేకపోయింది. రెడ్ బాల్ ఫార్మాట్ లోను చాంపియన్ గా నిలవాలని రోహిత్ చాలా పట్టుదలతో ఉన్నాడు. తొలిసారి ఈ టైటిల్ గెలిచిన భారత కెప్టెన్ గా నిలవాలని రోహిత్ శర్మ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. 2013 తర్వాత ఛాంపియన్ ట్రోఫీని భారత జట్టు అందుకోలేదు. అప్పట్లో ధోని కెప్టెన్సీలో ఈ టైటిల్ ను గెలిచారు. వన్డే ఫార్మాట్లో జరిగే టోర్నీలో టీమిండియా ఛాంపియన్ గా నిలవాలని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్ భారత్ అందుకోలేకపోయింది. వరుసగా పది మ్యాచ్లు గెలిచినప్పటికీ చివరి నిమిషంలో రోహిత్ శర్మకు అదృష్టం కలిసి రాలేకపోయింది. ఫైనల్ జరిగిన రోజు ఆసీస్ పైచేయి సాధించింది. టైటిల్ గెలవలేకపోయినా కెప్టెన్ గా రోహిత్ శర్మ మంచి మార్కులు సాధించాడు.


Also Read: Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

వన్డే వరల్డ్ కప్ మిస్ అయినప్పటికీ టి20 వరల్డ్ కప్ లో తన సత్తాను చాటాడు. భారత్ ను చాంపియన్ గా నిలబెట్టాడు. ఇక హిట్ మ్యాన్ కెప్టెన్సీపై తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోనీ కన్నా రోహిత్ శర్మనే అత్యుత్తమ కెప్టెన్ అని, ప్లేయర్లతో హిట్ మ్యాన్ చాలా క్లోజ్ గా ఉంటాడని చెప్పుకొచ్చాడు. సహచరులకు రోహిత్ శర్మ ఇంపార్టెన్స్ ఇస్తాడని, అందరితో కలిసి మాట్లాడతానని చెప్పాడు. ఎవరికి ఏం అవసరం ఉన్నా అడిగి తెలుసుకుంటాడు. రోహిత్ శైలి, ధోని శైలి చాలా భిన్నంగా ఉంటాయి. ప్లేయర్లతో మహేంద్ర సింగ్ ధోని ఎక్కువగా మాట్లాడడని చెప్పుకొచ్చాడు. తప్పుల నుంచి సహచర ఆటగాళ్లే పాఠాలు నేర్చుకోవాలని భావిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related News

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Big Stories

×