EPAPER

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Instant Glow Face Pack Homemade For Glowing Skin: ముఖం కాంతివంతంగా, మెరిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. పైగా పండుగల సమయం. పూజలు, వ్రతాలు, చేయాల్సి ఉంటుంది. ఇక చాలా మంది ఇంటికి వచ్చిపోతుంటారు. ఫేస్ గ్లో కోసం బ్యూటీ పార్లర్‌‌కి వెళ్లి రకరకాల ఫేసియల్ చేపించుకుంటారు. అయితే కొన్ని సార్లు అంత బడ్జెట్, సమయం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే సహజ పదార్ధాలతో ఫేసియల్స్ చేసుకోవచ్చు. చెప్పాలంటే వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. మన ఇంట్లోనే టోనర్లు, ఫేస్ మాస్క్, సీరమ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఇన్‌స్టంట్‌ గ్లో మీ సొంతం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మం శుభ్రం చేసుకోవడానికి..
ఫేషియల్ చేసుకునేటప్పుడు ముందుగా ముఖం శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు తీసుకుని అందులో చిటెకెడు ఉప్పు కలపాలి. కాటన్ బాల్ సహాయంతో ముఖాన్ని బాగా రుద్దండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ముఖంపై మురికి తొలగిపోతుంది.

ఈ విధంగా మినీ ఫేసియల్ చేయండి..
చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే చర్మం లోపల దాగి ఉన్న మురికి తొలగిపోతుంది. దీని కోసం రెండు, మూడు టేబుల్ స్పూన్ శనగపిండిలో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మసాజ్ చేస్తూ సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మీ ముఖం మెరిసిపోతుంది.


ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి.
ముల్తానీ మిట్టి కంటే మెరుగైన ఫేస్ ప్యాక్ మరొకటి ఉండదని చెప్పొచ్చు. ముల్తానీ మిట్టిలో చర్మ సౌందర్యాన్ని పెంచే  అనేక ఔషద గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందుకోసం ముల్తానీ మిట్టిలో సరిపడ రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ ముఖం మిల మిల మెరిసిపోతుంది.

Also Read: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

టోనర్‌ని ఉపయోగించండి.
ఇందుకోసం దోసకాయ ముక్కలను మిక్సీ పట్టి, వాటి నుండి వచ్చే రసాన్ని ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

ముఖానికి మాయశ్చరైజర్ రాయండి.
ఈ ఫేషియల్ అయిపోయినాక ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ప్రతి రోజు రాత్రి అప్లై చేసి ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు సార్లు చేస్తే మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనుండదు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×