EPAPER

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Amethi Family Murder| ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీలో ఒక టీచర్, అతని భార్య, ఇద్దరు పిల్లలను ఒక సైకో కొన్ని రోజుల క్రితం హత్య చేశాడు. అయితే హత్యకు నెల రోజుల ముందే పోలీసులకు టీచర్ భార్య ఫిర్యాదు చేసింది. తన కుటుంబాన్ని చంపేస్తానని ఒక వ్యక్తి పలుమార్లు బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ సైకో అనంత పని చేయడంతో రాష్ట్రంలోని బిజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శులు వెలువెత్తుతున్నాయి.


వివరాల్లోకి వెళితే.. అమేఠీ లోని భవానీ నగర్ ప్రాంతంలో గత గురువారం సునీల్ కుమార్ అనే టీచర్, అతని భార్య పూనమ్ భారతి, ఇద్దరు కూతుర్లను (ఒకరు ఒక సంవత్సరం, మరొకరు ఆరు సంవత్సరాల వయసు) తుపాకీతో చందర్ వర్మ అనే వ్యక్తి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. అయితే హత్య జరిగిన తరువాత విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. సునీల్ కుమార్ భార్య ఆగస్టు 18, 2024న రాయ్ బరేలిలో చందన్ వర్మ అనే వ్యక్తి తనను లైంగిక వేధించాడని, ఆ సమయంలో తన భర్త కూడా తన పక్కనే ఉండడంతో ఇద్దరూ కలిసి అతడిని ఎదరిస్తే.. ఇద్దరినీ కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. తనకు తన కుటుంబాని ఏదైనా హాని జరిగితే చందన్ వర్మదే బాధ్యత అని.. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..


కానీ పోలీసులు చందన్ వర్మపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు నెల రోజుల తరువాత అతను కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేశాడు. దీంతో ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై విమర్శలు చేసింది. నేరస్తులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నరంటూ ఎద్దేవా చేసింది.

రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యదవ్ కుటుంబం హత్య ఘటనపై స్పందిస్తూ.. ” రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? ఎక్కడైనా కనిపిస్తోందా? ప్రజలకు భద్రత లేదా?” అని ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమేఠీ ఎంపీ కిశోరీ లాల్ శర్మ మాట్లాడుతూ.. రాష్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని అయినా బిజేపీ ప్రభుత్వం అంతా బాగానే ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ.. చనిపోయిన టీచర్ సునీల్ కుమార్ తండ్రిని కలిసి పరామర్శించారని కిశోరీ లాల్ తెలిపారు.

దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసు విభాగంపై మండిపడ్డారిన సమాచారం. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ టాస్క ఫోర్స్ ఈ కేసుపై దృష్టి పెట్టింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు.. చందన్ వర్మ కోసం గాలించి పట్టుకున్నారు. అతడి ఫోన్ చెక్ చేస్తే.. అతను హత్య చేసే ముందు పూనమ్ భారతికి మెసేజ్ చేసి వార్నింగ్ ఇచ్చాడని.. త్వరలో కుటుంబం మొత్తాన్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఆ మెసేజ్ లో ఉంది.

నిందితుడు చందన్ వర్మ్ హత్య చేసే ముందు దేవాలయం వెళ్లి వధ పూజ చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Related News

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Chhattisgarh Encounter: మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Big Stories

×