EPAPER

Olympics In Hyderabad: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

Olympics In Hyderabad: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

 హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్


– ఈ లక్ష్యం దిశగా స్పోర్ట్స్ పాలసీ
– గత పదేళ్లుగా క్రీడల్లో వెనకబడ్డాం
– గచ్చిబౌలి కేంద్రంగా స్పోర్ట్స్ వర్సిటీ
– అన్ని క్రీడలకూ ప్రోత్సాహం దక్కాలి
– నగరపు స్టేడియాలన్నీ ఒకే గొడుకు కిందికి
– స్కిల్ వర్సిటీ తరహాలో స్పోర్ట్స్ బోర్డ్
– స్పోర్ట్స్ రివ్యూ‌లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, స్వేచ్ఛ: దేశ క్రీడారంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిపేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్దం చేయాలని, నూతన పాలసీలో రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా, ప్రతి ఆటకు ప్రాధాన్యం దక్కేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ (క్రీడా) సలహాదారు జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్‌) చైర్మన్‌ శివసేనారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ పాల్గొన్నారు.


గచ్చిబౌలి స్టేడియం వేదికగా..

కొత్తగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీని విజిట్ చేయడం జరిగిందని, వారి మెనేజ్ మెంట్‌తో మాట్లాడటం, తెలంగాణలో స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేయాలని వారితో ఒప్పందం కూడా జరిగిందని వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో సుమారు 12 వివిధ క్రీడల అకాడమీలను ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక వ‌స‌తులతో బాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉండేలా చూడాలన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఓకే హబ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

అవన్నీ వర్సిటీ పరిధిలోకే..

యూనివ‌ర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మీలు, శిక్షణ సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని సీఎం సూచించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీ వంటి క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం అభిప్రాయపడ్డారు. దేశం, రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులు, ఇక్కడి యువత శారీరక నిర్మాణం తీరుకు అనువైన క్రీడలను గుర్తించి, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. 20 ఏండ్ల కిందటే హైదరాబాద్ ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిందని.. 2036 ఒలింపిక్స్ గేమ్స్‌ ఇండియాలో నిర్వహించాలని ప్రధాని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆ వేదిక హైదరాబాద్ అయ్యేలా వీలున్నంత త్వరగా సిద్ధం కావాలన్నారు. క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

విరాళాల వెల్లువ

వరదలతో కుదేలైన తెలంగాణను ఆదుకునేందుకు శ్రమిస్తున్న ప్రభుత్వానికి పలు వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలు సంస్థలు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నాయి. శుక్రవారం ఉదయం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు వి.సురేందర్, ఎస్.ఎన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి రూ. 1,01,75,000 లక్షల చెక్‌ను అందజేశారు. అలాగే, విన్స్ బయో ప్రొడక్ట్స్ సంస్థ రూ. 51 లక్షల విరాళం అందించింది. ఆ సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. అలాగే, బొండాడ గ్రూప్ సీఎండీ బొండాడ రాఘవేంద్రరావు సీఎంను కలిసి సీఎం సహాయ నిధి కోసం 25 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. మరోవైపు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఎండీ కె. రామ్మోహన్ రావు 25 లక్షల రూపాయల చెక్‌ను సీఎంకు అందజేశారు.

Related News

Hyderabad City: హైదరాబాద్ సిటీ.. రేవంత్ సర్కార్ ఫోకస్.. ఇకపై నాలుగు కార్పొరేషన్లు

Hyderabad City Development: భాగ్యనగరానికి మహర్దశ – 6 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ఏయే ప్రాంతాల్లో నిర్మిస్తారంటే..

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Big Stories

×