EPAPER

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Denmark Driving Rules: డెన్మార్క్ డ్రైవింగ్ రూల్స్.. కారులో అవి లేకపోతే ఫైన్ వేస్తారట, అందుకే అక్కడ యాక్సిడెంట్స్ ఉండవ్!

Driving in Denmark:  డెన్మార్క్ వెదర్ సాధారణంగా తడిగా ఉంటుంది. నెలలో చాలా సార్లు వర్షం కురుస్తుంది. విచిత్రంగా ఇక్కడ వేసవి కాలంలోనూ వానలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సర్కారు ప్రత్యకంగా డ్రైవింగ్ రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని ప్రతి వాహనదారుడు పాటించడం తప్పనిసరి చేసింది.  డెన్మార్క్ లో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి ఏటా విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. డెన్మార్క్ లోని అనేక ఐలాండ్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. డెన్మార్క్ రోడ్లు ఎక్కువగా పర్వతాలు, మైదాన ప్రాంతాల మీదుగా వెళ్లడం, వర్షం కురవడం వల్ల డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.


బేసిక్ డ్రైవింగ్ రైల్స్

డెన్మార్క్‌ లో డ్రైవ్ చేయడానికి 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. UK డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.  డెన్మార్క్‌ లో మీరు స్వంత కారును డ్రైవింగ్ చేయాలంటే  థర్డ్ పార్టీ బీమా ఉండాలి. అలాగే V5C ‘లాగ్‌బుక్’ లాంటి కారు గుర్తింపు డాక్యుమెంట్స్ చూపించాలి.  డెన్మార్క్  రోడ్లపై వాహనం నడపాలంటే నెంబర్ ప్లేట్ లో కచ్చితంగా ‘UK’ అక్షరాలు ఉండాలి. మీరు వాహనాన్ని రెంట్ కు తీసుకుంటే, కనీసం 21 ఏళ్లు ఉండాలి. డ్రైవింగ్ చేయడానికి అర్హులని నిరూపించడానికి రెంట్ కంపెనీ ఇచ్చిన డాక్యుమెంట్ ను దగ్గర ఉంచుకోవాలి. డ్రైవింగ్ లో మోబైల్ ఫోన్ మాట్లాడ్డం నిషేధం.


స్పీడ్ లిమిట్

సిటీ రోడ్ల మీద గరిష్టంగా గంటకు 50 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సిటీ దాటిన తర్వాత స్పీడ్ లిమిట్ 80 కిలో మీటర్లు ఉంటుంది. ఆయా వాహనాలను బట్టి వేగంలో మార్పులు ఉంటాయి. గరిష్టం వేగం 100 కి. మీ నుంచి 130 కి. మీ వరకు ఉంటుంది. పరిమితికి మించి వేగంగా నడిపితే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు.

మద్యం తాగి వాహనాలు నడపకూడదు

తాగి వాహనాలు నడపడం నేరం. ఇక్కడి పోలీసులు  డ్రంకెన్ డ్రైవ్ పరిమితి 0.5 గ్రా/లీ గా నిర్థారించారు. బ్రీత్ ఎనలైజర్ లో అంతకు మించి చూపిస్తే జరిమానా విధిస్తారు.

కారులో ఏం తీసుకెళ్లాలి?

కారులో మీతో పాటు  మీ డాక్యుమెంటేషన్‌ తో పాటు, కారులోవార్నింగ్ ట్రయాంగిల్ తప్పనిసరిగా ఉండాలి.  రిఫ్లెక్టివ్ జాకెట్, అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. కారు ఆన్ అయినప్పటి నుంచి ఇంజిన్ ఆఫ్ చేసే వరకు  తప్పనిసరిగా డిప్డ్ లైట్లను ఆన్ లోనే ఉంచాలి. ఒకవేళ ఆన్ చేయకపోతే పోలీసుల జరిమానా విధిస్తారు. రోడ్ ట్రిప్‌  ప్లాన్ చేస్తే, రోప్, స్పేర్ బల్బులు, జంప్ లీడ్స్ కూడా ఉండాలి. డెన్మార్క్‌ లో వింటర్ టైర్లు తప్పనిసరి కాదు.  కానీ, చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అధికారులు సిఫార్సు చేస్తారు.

సీటు బెల్టులు

సీట్‌బెల్ట్ నియమాలు UKలో మాదిరిగానే ఉంటాయి. కారులో ఉన్నంత సేపు తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోవాలి. పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ సీటును ఉపయోగించాలి.

డ్రైవింగ్

వీలైనంత వరకు కుడివైపు లేన్‌లో కారు నడపాలి. ఓవర్‌ టేక్ చేసే సమయంలో ఎడమ వైపున నుంచి చేయాలి. కచ్చితంగా అవసరం అనుకుంటేనే హారన్ మోగించాలి,  ట్రాఫిక్ సిగ్నల్‌లు ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కంటేనర్లు, స్లో మూవర్స్ వాహనాల కోసం ప్రత్యేకంగా లేన్లు ఉన్నాయి.

రహదారి చిహ్నాలు

రోడ్ల మీద హెచ్చరిక సంకేతాలు ఎక్కువగా ఎరుపు రంగులో త్రిభుజాకారంలో ఉంటాయి. వార్నింగ్ చిహ్నాలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటాయి. డైరెక్షనల్ సంకేతాలు పసుపు,  తెలుపు రంగులో ఉంటాయి. సాధారణ సమాచార సంకేతాలు  బ్లూ కలర్ లో ఉంటాయి.

ఫ్యూయెల్

‘బెంజిన్‌స్టేషన్’  లేదంటే ‘సర్వీస్టేషన్’ నుంచి పెట్రోల్, డీజీల్ తీసుకోవాలి. ఫ్యూయెల్ స్టేషన్లలో చాలా వరకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను తీసుకుంటారు. నగదును ఇచ్చి కూడా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.

టోల్ రోడ్లు

డెన్మార్క్‌లో టోల్ రోడ్లు లేవు. స్టోర్‌ బాల్ట్, ఒరెసుండ్ బ్రిడ్జిలను ఉపయోగించడానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

పార్కింగ్

చిన్న రహదారులపై పార్కింగ్ సదుపాయం ఉంటుంది.  అయితే, మీ కారును ప్రయాణ దిశకు అపోజిట్ లో ఉంచాలి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.  పాదచారులు లేదంటే సైకిల్ క్రాసింగ్ లైన్ నుంచి ఐదు మీటర్లు, జంక్షన్ నుంచి 10 మీటర్లు, బస్ స్టాప్ నుండి 12 మీటర్ల కంటే దగ్గరగా వాహనాలను పార్క్ చేయకూడదు.

ఎమర్జెన్సీ నెంబర్

డెన్మార్క్‌ లో వాహనదారులు అత్యవసర సాయం కోసం 112కి డయల్ చేయవచ్చు. ఈ నెంబర్ ద్వారా ఫైర్, పోలీస్, అంబులెన్స్ సర్వీస్ పొందవచ్చు. చివరిగా మరో షాకింగ్ రూల్. ఎవరైనా నిర్లక్ష్యంతో కారు నడిపి ప్రమాదానికి కారణమైతే.. నేరుగా శాలరీ నుంచే

Read Also:న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Related News

Telegram Messenger: ‘టెలిగ్రామ్’ అడ్డాగా అలాంటి పనులు.. అమెరికా వార్నింగ్, మరి ఇండియా?

Israel A year of war: 365 రోజులు.. 26,000 రాకెట్లు.. 720 మంది దుర్మరణం.. ఐడీఎఫ్ కీలక డేటా రిలీజ్

Viral News: 51 ఏళ్ల టీచరమ్మ ‘కామ’ పాఠాలు, బాలుడితో అలా చేస్తూ.. మరెక్కడా చోటు దొరకలేదా?

Elon Musk: మస్క్ మామ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ.4 వేలు ఇస్తాడట, చంపేద్దాం అనుకుంటున్నాడా?

Chinese killed: పాకిస్థాన్‌లో చైనీయులపై ఉగ్రదాడి.. చైనావాసులనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?

Nobel Prize 2024: ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్, ఇంతకీ ఎవరు వారు? ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలిస్తే షాకవుతారు

×