EPAPER

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి
Rice Water: ఒకప్పుడు అన్నం ఉడకడానికి ఎక్కువ నీటిని వేసి ఆ గంజిని వార్చేవారు. అలా వచ్చిన గంజిని తిరిగి ఆహారంలో కలుపుకొని తినేవారు. ఆ గంజిలో ఎన్నో పోషకాలు ఉండేవి. అందుకే అప్పట్లో మనుషులంతా ఎంతో బలంగా ఉన్నారని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు వండే పద్ధతులు మారిపోయాయి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు వచ్చేసాయి. దీంతో గంజి రావడమే మానేసింది. గంజి వార్చే పద్ధతిలోనే అన్నాన్ని వండి ఆ గంజిని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
గంజినీటి వల్లే ఇలాంటి రోగాలు బారిన పడకుండా మన పూర్వీకులంతా ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కేవలం వేసవిలోనే కాదు ఏ కాలంలోనైనా గంజిని తాగడం వల్ల మేలే జరుగుతుంది. వేసవిలో ఈ గంజిని తాగితే డీహైడ్రేషన్ అనే సమస్య దగ్గరకే రాదు. గంజిలో కొన్ని ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని తాగితే చాలు. డీహైడ్రేషన్ అనేది శరీరాన్ని తాకదు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలన్నా కూడా గంజినీరు రక్షణగా నిలుస్తుంది. గంజి నీటిని తాకడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
గంజి వచ్చేలా అన్నం ఉండి ఆ గంజిని వేడివేడిగా తాగి చూడండి. శరీరానికి ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఈ గంజిని కూరల్లో కూడా వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల కూరలు చిక్కగా ఇగురు లాగా వస్తాయి. మీ ఇంట్లో పిల్లలకు గంజిని తాగించేందుకు ప్రయత్నించండి. ఇది ఖనిజాలు, విటమిన్లతో ఉంటుంది. కాబట్టి వారి శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే వారికి బలాన్ని అందిస్తుంది.
పిల్లలకు, పెద్దలకు జీర్ణశక్తిని అందించాలంటే గంజి మొదటి స్థానంలో ఉంటుంది. గంజిని బేబీ ఫుడ్ గా కూడా భావించవచ్చు. చంటి పిల్లలకు గంజినీటిని తాగించేందుకు ప్రయత్నించండి. ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. వారు విరేచనాలు బారిన పడితే డీహైడ్రేషన్ సమస్య శరీరంలో రాకుండా ఉండాలంటే గంజిని తాగిస్తూ ఉండండి. ఆరు నెలలు దాటిన పిల్లలకు గంజినీళ్లను తాగించవచ్చు. ఆ గంజిలో మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసి చేతితోనే మెత్తగా మెదిపి, రుచికి చిటికెడు ఉప్పు వేసి చంటి పిల్లలకు తినిపించండి. ఇది వారికి ఎంతో నచ్చుతుంది. ఏడు ఎనిమిది నెలల వయసు ఉన్న ఏ పిల్లలకైనా ఈ ఆహారాన్ని తినిపించవచ్చు.
గంజినీళ్లను తాగడం వల్ల విరేచనాలు ఆగిపోతాయి. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడేవారు గంజినీరుని అధికంగా తాగండి. బయట దొరికే ఓఆర్ఎస్ కన్నా గంజినీళ్లే శక్తివంతంగా పనిచేస్తాయి. దీన్ని ఎనర్జీ డ్రింక్ గా భావించి తాగడం అలవాటు చేసుకోండి.
గంజినీళ్లు రోజూ తాగే వారి చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. వారి జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. గంజి నీళ్లు అధికంగా ఉంటే ఆ నీళ్లతోనే జుట్టును తడుపుకొని కాసేపు ఉండండి. తర్వాత స్నానం చేయండి. మీ వెంట్రుకలు మెరవడం గమనిస్తారు. అదే గంజినీటితో కాటన్ దుస్తులను చివరిలో ఉతికినా కూడా అవి మెరుపువంతంగా కనిపిస్తాయి. గంజినీటిని వచ్చేలా ఉండడం చాలా సులువు.
గంజినీరు కావాలంటే ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీటిని వేయండి. అన్నం ఉడికే వరకు ఆ నీటిని అలాగే ఉడికించి తర్వాత వడకట్టండి. లేదా వార్చండి. గంజినీరు వేరవుతుంది. అన్నం పొడిపొడిగా వస్తుంది. ఆ గంజిని చల్లార్చి చిటికెడు ఉప్పు వేసుకొని తాగి చూడండి. శరీరానికి శక్తి వెంటనే అందుతుంది.


Related News

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×