EPAPER
Kirrak Couples Episode 1

India: రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్..

India: రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్..

India : ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించింది. 145 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 45/4 ఓవర్ నైట్ స్కోర్ తో 4వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మరో 11 పరుగులకే ఉనద్కట్ ( 13 ) వికెట్ ను కోల్పోయింది. మరో 15 పరుగుల తర్వాత రిషభ్ పంత్ ( 9) అవుట్ అయ్యాడు. ఈ వెంటనే అక్షర్ పటేల్ (34) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 74 పరుగలకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.


అశ్విన్, అయ్యర్..అదుర్స్..
ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్ కు , రవిచంద్రన్ అశ్విన్ జత కలిశాడు. ఈ జోడి నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించింది. జట్టు స్కోరు వంద పరుగులు దాటగా అయ్యర్, అశ్విన్ ఎడాపెడా బౌండరీలు బాదడంతో భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి వరకు క్రీజులో ఉన్న అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు సాయంతో 42 పరుగులు చేశాడు. అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ జోడి 8వ వికెట్ కు 71 పరుగుల జోడించి భారత్ కు అద్వితీయమైన విజయాన్ని అందించింది.

బంగ్లా బౌలర్ల జోరు..
బంగ్లాదేశ్ బౌలర్లు రెండో ఇన్సింగ్స్ లో భారత్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు నేలకూల్చి భారత్ పై ఒత్తిడి పెంచాడు. మరోవైపు కెప్టెన్ షకీబ్ హల్ హసన్ రెండు వికెట్లు తీసి భారత్ బ్యాటర్ల కట్టడి చేశాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు భారత్ టాప్ ఆర్డర్ ను చకచకా కూల్చేశారు.


ఆ ముగ్గురే నిలిచారు..
అక్షర్ పటేల్, అశ్విన్, అయ్యర్ బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్లలో ఒక్కరూ కూడా రెండెంకెల స్కోర్ సాధించలేదు. రాహుల్ (2), గిల్ ( 7) , పూజారా (6) , కోహ్లీ (1) పంత్ (9) దారుణంగా విఫలమయ్యారు. ఒక దశలో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోవడంతో భారత్ కు ఓటమి తప్పదనిపించింది. అయితే అశ్విన్, అయ్యర్ అసమాన పోరాటంతో భారత్ ను విజయతీరాలకు చేర్చారు.

బౌలింగ్ భళా
ఈ మ్యాచ్ లో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు తీశాడు. రెండో ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ లోనూ రాణించాడు. 12 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులో స్ధానం దక్కించుకున్న జయదేవ్ ఉనద్కట్ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ కు చేరిన సమయంలో నైట్ వాచ్ మెన్ బరిలోకి దిగిన రెండో ఇన్సింగ్స్ లో బంగ్లా బౌలర్లను కాసేపు నిలువరించాడు. పేసర్ ఉమేష్ యాదవ్ మొత్తం 5 వికెట్లు తీసి తనలో సత్తా తగ్గలేదని చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్ తో రాణించిన అక్షర్ పటేల్ .. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. సిరాజ్ కు 2 వికెట్లకు దక్కాయి. మొత్తంగా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించలేకపోయింది.

నలుగురు అదుర్స్.. ఆ ఇద్దరూ ప్లాప్ షో..
పంత్ (93), అయ్యర్ (87) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేయగలిగింది. అయ్యర్ రెండో ఇన్సింగ్స్ లోనూ పట్టుదలగా ఆడి జట్టును గెలిపించాడు. మొత్తంగా రాహుల్, గిల్ , పూజారా, కోహ్లీ ఈ నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యారు. అయితే పూజారా, గిల్ తొలి టెస్టు రాణించారు. రెండో మ్యాచ్ లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇక రాహుల్, కోహ్లీ 4 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్ 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. రెండు టెస్టుల్లో కలిపి 222 పరుగులు చేసిన పూజారా ఫ్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు అందుకున్నాడు.

ఒక్క మార్పు.. తీవ్ర వివాదం..
తొలి టెస్టులో 8 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లోనూ రాణించిన కులదీప్ యాదవ్ ను తప్పించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్ ఫలితం తేడాగా వచ్చుంటే జట్టుపై విమర్శలు మరింత పెరిగేవి. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ పై అదనపు పేసర్ కు అవకాశం ఇవ్వడం భారత్ టీమ్ మేనేజ్ మెంట్ తప్పిదమే. కులదీప్ రెండో టెస్టు ఆడుంటే కచ్చితంగా భారత్ సునాయాసంగా గెలిచేదని క్రికెట్ నిపుణులు చెబుతున్న మాట. ఏదిఏమైనా ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆటగాడిని తర్వాత మ్యాచ్ ఆడించకపోవడం తీవ్ర దుమారాన్ని రేపింది.

Related News

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Big Stories

×