EPAPER

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Thyroid: నేటి కాలంలో థైరాయిడ్ సమస్య వేగంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, క్రమ రహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి.. థైరాయిడ్ ప్రధాన కారణాలు. ఈ పరిస్థితి శరీరం యొక్క జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, మానసిక కల్లోలం, ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక ఇతర శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది.


దీనికి చికిత్స చేయడానికి అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది సహజమైన హోం రెమెడీస్ ఇష్టపడతారు ఎందుకంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మంచి ప్రయోజనాలను అందిస్తాయి. మీరు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ, మందులకు దూరంగా ఉంటే, కొన్ని ఆకుల రసాన్ని తాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.

తులసి ఆకుల రసం:


తులసి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి థైరాయిడ్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం, గ్లాస్ నీటిలో తాజా తులసి ఆకుల రసం తీసి అందులోనే ఒక చెంచా తేనెను వేసి కలిపి త్రాగాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

పుదీనా ఆకుల రసం :
పుదీనా కూడా థైరాయిడ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడే శక్తివంతమైన ఔషధ మొక్క. పుదీనా ఆకుల రసం జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అశ్వగంధ ఆకుల రసం:
అశ్వగంధ ఒక ఆయుర్వేద మూలిక. ఇది శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది. అశ్వగంధ ఆకుల రసాన్ని తాగడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. థైరాయిడ్ యొక్క ప్రధాన కారణాలలో ఒకటైన ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీరు శారీరక శక్తి పెరుగుతుంది.

Also Read: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

గిలోయ్ ఆకుల రసం:
గిలోయ్ ఒక సహజ రోగనిరోధక బూస్టర్ దీనిలోని ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. గిలోయ్ ఆకుల రసాన్ని తాగడం వల్ల థైరాయిడ్ తగ్గుతుంది. దీని కోసం, తాజా గిలోయ్ ఆకుల రసాన్ని తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక చెంచా తేనె కలిపి త్రాగాలి.

పైన చెప్పిన వాటిని తరుచుగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి మందులు వాడకుండా థైరాయిడ్ తగ్గడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహన మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Big Stories

×